Udaya Bhanu: ఉదయభాను.. ఒకప్పుడు బుల్లితెరపై మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై రాణిస్తూనే.. ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. వివాహం అనంతరం బుల్లితెరకు.. సినిమాలకు ఈ నటి దూరమైంది. ప్రస్తుతం వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు ఉదయభాను తాజాగా పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
ఉదయ భాను (Udaya Bhanu) తెలుగు యాంకర్ గా ఎలాంటి గుర్తింపు సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే.
విజయ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న అనంతరం ఇద్దరు పిల్లలతో పర్సనల్ లైఫ్ ని లీడ్ చేస్తోంది.
గ్లామర్ పరంగా కూడా ఉదయభానుకు తిరుగులేదు. అందుకే లీడర్, జులాయి వంటి చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి తానేంటో నిరూపించుకుంది.
మరికొన్ని చిత్రాల్లో లీడ్ రోల్ లో కూడా నటించింది.
తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఉదయభాను టీ తాగుతున్న వీడియో ఉంది.
అందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.. అక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఆ పోస్ట్ ని మళ్లీ మళ్లీ చూడాల్సిందే. ఆ వీడియో పవన్ కళ్యాణ్ కోసమేనా అని అనేలా ఉంది.
గాజు గ్లాసులో టీ తాగుతున్న వీడియోను ఉదయభాను పోస్ట్ చేసింది. ఈ గ్లాస్ లో తీ తాగితే ఆ కిక్కే వేరబ్బా అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పింది.
ఇక ఈ వీడియోలో బ్యాగ్ గ్రౌండ్ లో బీమ్లా నాయక్ పాట వినిపిస్తుండడం మరో విశేషం. ఇందులో పవర్ స్టార్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జోడించింది ఈ అమ్మడు.
దీంతో ఉదయభాను జనసేన పార్టీకి మద్దతుగానే ఈ వీడియోను పోస్టు చేసిందని అర్ధం అవుతుంది.
దీంతో నెటిజెన్లు కూడా జనసేనకు మద్దతు తెలుపుతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఉదయభాను పోస్ట్ చేసిన ఈ వీడియోకి.. జై జనసేన అని కామెంట్లు ఎక్కువ పెడుతున్నారు.
దీంతో బహుశా ఉదయ భానుకి కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా అని ప్రజలు అనుకుంటున్నారు.
మరికొందరు.. ఉదయభాను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. మరి దీనిపై ఉదయభాను ప్రకటన చేయాల్సి ఉంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/