Site icon Prime9

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ #OG .. అనిరుధ్ ప్లేస్ లో తమన్.. అతనే కావాలంటున్న ఫ్యాన్స్

thaman confirmed as music director for pawan kalyan og movie

thaman confirmed as music director for pawan kalyan og movie

Pawan Kalyan OG: ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. చేతి నిండా వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్నారు పవన్.

అలానే యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమా #OG అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.

నాలుగేళ్ల తర్వాత సుజీత్‌ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఈరోజు అన్నపూర్ణ స్టూడీయోస్‌లో చిత్రయూనిట్‌ పూజ కార్యక్రమం నిర్వహించింది.

డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేయగా.. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇప్పుడు ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ..

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటికీ నుంచి మూవీ కాస్ట్ అండ్ క్రూ గురించి అంతా విపరీతంగా చర్చించుకుంటున్నారు.

ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి అనిరుధ్   సంగీతం అందిస్తాడని పవన్ ఫ్యాన్స్ అంతా అనుకున్నారు.

అయితే తాజాగా ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ తమన్ కొట్టేశాడని తెలుస్తుంది.

తమన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన సినిమాలు ఈ మధ్య ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

సీన్ కాస్త వీక్ గా ఉన్నా కానీ.. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తమన్ ఈ సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాడు.

తమన్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన  భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలకి మ్యూజిక్ అందించారు.

ఈ రెండు సినిమాల్లో తమన్ కొట్టిన బీజీఎంకి పవన్ ఫాన్స్ ఫిదా అయ్యారు.

దీంతో తమన్ మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ అదరగొట్టాలి అని.. హ్యాట్రిక్ సూపర్ హిట్ ఆల్బమ్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో #FireStormIsComing, #PawanKalyan #OG ట్యాగ్ లు ట్రెండింగ్ గా మారాయి.

 

తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

కథానుసారం ఈ సినిమాను పాటలు, ఫైట్స్‌ లేకుండా చిత్రీకరిస్తున్నారట.

ప్రభాస్ నటించిన సాహో సినిమాకి .. ఈ సినిమాకి లింక్ ఉందట.. ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తారో లేదో సస్పెన్స్ గా చెబుతున్నారు.

ఆ మూవీ లోని పాత్రల గురించి అయితే ప్రస్తావిస్తారని టాక్ నడుస్తుంది.

హాలీవుడ్‌ ఫిల్మ్‌ అనుభూతిని అందించేలా మూవీ మేకింగ్‌ ఉండబోతున్నట్లు తెలుస్తున్నది.

 

ఇటీవల న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఆ పోస్టర్ లో They Call Him #OG అని వుంది.

ఇక్కడ ఓజీ అంటే ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌.. అని ఈ ట్యాగ్‌ లైన్‌ చెబుతోంది.

అలాగే ఆ పోస్టర్‌లో పవన్‌ ఫొటోపై రాసి ఉన్న భాష జపానీస్‌. ఆ భాషలో జపానీస్ లో అగ్నితుఫాన్‌ వస్తోంది అని రాశి ఉంది.

అదే విధంగా పవన్‌ కళ్యాణ్(Pawan Kalyan) నీడలో గన్‌ కనిపిస్తుంది.

పవన్‌ ముందు ఉన్న వృత్తాకారం జపాన్‌ జాతీయ జెండాను గుర్తు చేస్తోంది.

అలాగే పోస్టర్‌లో ఒక వైపు విగ్రహం ఆకారం కనిపిస్తుంది. అది జపాన్‌ లోనే అత్యంత ఎత్తైన బుద్ధుడి విగ్రహం. ఇది ఆ దేశంలోని ఉషికు ప్రాంతంలో ఉంది.

పోస్టర్‌లో మరోవైపు మన దేశంలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా కనిపిస్తుంది.

అలాగే ఈ సినిమా కథ జపాన్‌, ముంబయి నేపథ్యంలో సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version