Anant-Radhika Family Sangeet: ముంబయిలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ వివాహ వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన సంగీత్ కార్యక్రంలో టీ 20 ప్రపంచ కప్ విజేతలను సాదరంగా అభినందించారు.
నీతా అంబానీ భావోద్వేగం..(Anant-Radhika Family Sangeet)
ఈ సందర్బంగా నీతా అంబానీ మాట్లాడుతూ ఇక్కడ మనమందరం కుటుంబసభ్యులం. కానీ నాకు మరొక కుటుంబం ఉంది, ఇది దేశం గర్వించేలా చేసింది. ప్రతి ఒక్కరి హృదయాన్ని గర్వంగా ఉప్పొంగేలా చేసింది ఇది ఎంత గొప్ప అనుభూతనేది నేను మీకు చెప్పలేను. ఈ రాత్రి నా ముంబై ఇండియన్స్ కుటుంబాన్ని ఇక్కడ కలిగి ఉండటం వేడుక రోజు, ఈ రాత్రి అనంత్ మరియు రాధికతో పాటు, మేము భారతదేశంతో జరుపుకోబోతున్నామని నీతా పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆమె కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యను వేదికపైకి పిలిచారు. వారిని పిలిచేటపుడు వారు సాధించిన ఘనతలను కూడా చెప్పారు. వారిని హత్తుకుని నీతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా హార్దిక్ పాండ్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కఠిన సమయాలు నిరంతరం ఉండవు. కానీ, వాటికి ఎదురు నిలిచినవారే ముందుకు సాగగలరు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో పలువురు క్రికెట్, బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు.
“𝙏𝙤𝙪𝙜𝙝 𝙏𝙞𝙢𝙚𝙨 𝘿𝙤𝙣’𝙩 𝙇𝙖𝙨𝙩, 𝙏𝙤𝙪𝙜𝙝 𝙋𝙚𝙤𝙥𝙡𝙚 𝘿𝙤”👏
Mrs. Nita Ambani summed up Team India’s brilliant campaign as they stood against the odds in the #T20WorldCup and emerged as the undisputed champions. 🏆🇮🇳#MumbaiIndians pic.twitter.com/uPibPmWTGK
— Mumbai Indians (@mipaltan) July 6, 2024