Superstar Mahesh Babu : యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ని ఆరంభించి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చి.. హీరోగా కూడా అదరగొడుతున్నాడు సుహాస్.
లాక్ డౌన్ సమయంలో ఆహా ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన “కలర్ ఫోటో” సినిమాతో హీరోగా భారీ విజయం అందుకున్నాడు ఈ యంగ్ హీరో.
అంతకుముందే పడిపడి లేచే మనసు, మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. లాంటి పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించాడు.
కలర్ ఫోటో మూవీ మంచి హిట్ సాధించడమే కాకుండా.. నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకోవడంతో సుహాస్ కి వరుస అవకాశాలు వచ్చాయి.
దీంతో సుహాస్ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఇటీవల హిట్-2 సినిమాలో సీరియల్ కిల్లర్ గా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నాడు.
అయితే తాజాగా సుహాస్ నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ అయ్యింది.
సుహాస్ కి జంటగా తీనా శిల్పారాజ్ ఈ మూవీలో నటించింది. అలానే ఈ చిత్రంలో రోహిణీ, ఆశిష్ విద్యార్థి, గోపరాజు రమణ, గౌరి ప్రియా ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ సినిమాకి షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వం వహించగా.. ఛాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ పతాకాలపై అనురాగ్‌ర ఎడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ నిర్మించారు.
తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు చూశాడు.
సుహాస్ యాక్టింగ్ బాగా నచ్చింది : మహేష్ బాబు
మూవీ బాగా నచ్చడంతో చిత్ర యూనిట్ ని తన ఇంటికి పిలిపించుకొని మరి అభినందించడం విశేషం అని చెప్పాలి.
ఈ మేరకు మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ”రైటర్ పద్మభూషణ్ సినిమా హృదయానికి హత్తుకునే సినిమా, ముఖ్యంగా క్లైమాక్స్.
ఫ్యామిలీ ఆడియన్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో నటించిన సుహాస్ యాక్టింగ్ బాగా నచ్చింది అంటూ సుహాస్ ని మహేష్ అభినందించాడు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ.. చిత్ర యూనిట్ కి సక్సెస్ అందుకున్నందుకు అభినందనలు తెలియజేశాడు.
ఈ ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ సుహాస్
టీం : ఎందుకు ఏడుస్తున్నావ్ ?
మీ : ఏమో వచ్చేస్తుంది.
సూపర్ సైజ్ థాంక్యూ సార్🙏. హ్యాప్పీ టియర్స్ ❤️ అని రాసుకొచ్చాడు.
మహేష్ బాబుకి తాను వీరాభిమాని అని సుహాస్ గతంలో తెలిపాడు.
Team : Endhuku Edusthunav?
Me : Emo Vacchesthundhi 🥹
Super Size Thank you Sir🙏. Happy tears ❤️ https://t.co/DUHyhZqyjN— Suhas 📸 (@ActorSuhas) February 6, 2023
పద్మభూషణ్ గొప్ప రైటర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటాడు.. లైబ్రరీలో పనిచేస్తుంటాడు.
ఎన్నో కష్టాలు పడి ఓ పుస్తకం ప్రింట్ చేస్తాడు. అది సేల్ కాదు. అందుకోసం అనేక తిప్పలు పడుతుంటాడు.
ఈ క్రమంలో తన పేరుతో మరో పుస్తకం ప్రింట్ అయి అది బాగా సేల్ అవుతుంది.
దీంతో అది తనే అని చెప్పుకుంటూ పాపులర్ అవుతాడు పద్మభూషణ్, మరి ఆ పుస్తకం రాసిందెవరు? దాన్ని పద్మభూషణ్ ఎలా కనిపెట్టాడనేది కథ.
క్లైమాక్స్ లో మహిళలు, పెళ్లైన ఆడవాళ్ల కోరికల గురించి చెప్పి అందరినీ ఏడిపించేశారు.
ఫస్ట్ డే నుంచే మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న మంచి ఓపెనింగ్స్ అందుకుంది.
ముఖ్యంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/