Kerala Child Rights: కేరళ బాలల హక్కుల కమిషన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో ఇక నుంచి సార్, మేడమ్ అని పిలవవద్దని సూచించింది. ఈ పదాలను ఇకనుంచి ఉపయోగించవద్దని తెలిపింది. వీటికి బదులు సార్, మేడమ్ ను కేవలం టీచర్ అని మాత్రమే సంబోంధించాలని పేర్కొంది.
కారణం ఇదే
మనకు ఊహ తెలిసినప్పటినుంచి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను టీచర్ లేదా సార్ అని పిలిచేవాళ్లం.
ఆఫీసులు, కార్యాలయాల్లో కూడా సార్ మేడమ్ అని పిలుచుకుంటాం. అయితే ఈ రెండింటిని పాఠశాలల్లో ఉపయోగించవద్దని.. అలాంటి పదాలను వాడకూడదని కేరళ బాలల హక్కుల కమిషన్ (Kerala Child Rights) పేర్కొంది.
దీనిపై ఉత్తర్వులను సైతం జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇది అమలు చేయాలని తెలిపింది.
రెండు నెలల్లోగా నివేదిక
బాలల హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు పాఠశాలల యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేయాలని.. రాష్ట్ర విద్యాశాఖను ఆదేశించింది.
దీనిపై బాలల హక్కుల కమిషన్ వివరణ తెలుపుతు స్త్రీ, పురుషుడు ఇద్దరు సమానమే అని చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
గతంలో కేరళ స్టేట్ కమిషన్ ప్యానెల్.. పాఠశాలల్లో కేవలం టీచర్ అనే పదాన్ని మాత్రమే వాడేలా చూడాలని విద్యాశాఖకు సూచించింది.
ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా తాజా ఉత్తర్వులు వచ్చాయి. సార్, మేడం అనే పదాలకు స్వస్తి చెప్పాలని.. ఓ వ్యక్తి పిటిషన్ వేశారు.
దీనిపై విచారణ జరిపిన కమిషన్ ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఉత్తర్వుల అమలు తీరుపై రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కేరళ ప్రభుత్వాన్ని బాలల హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
స్తీ, పురుష సమానత్వం కోసమే ఈ నిర్ణయం తీసుకున్న కేరళ బాలల హక్కుల కమిషన్.
ఈ ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్ధిస్తే.. మిగతా రాష్ట్రాలు అమలు పరిచే అవకాశం.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/