Singer Sunitha : సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తన గాత్రంతో వందల పాటలు పాడి శ్రోతలను ఆకట్టుకుంది సునీత.
అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సునీత చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది.
తన పాటలతో ఎంతో మంది హృదయాలను దోచుకున్నారు.
పలు భాషల్లో తన గాత్రంతో మ్యాజిక్ చేసి ప్రజల హృదయాలను కొల్లగొట్టారు ఈమె.
కాగా సునీత ప్రముఖ వ్యాపారవేత్త రామ్ ను కొంతకాలం క్రితం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా కూడా యాక్టీవ్ గా ఉంటూ… అభిమానులకు మరింత చేరువయ్యారు సునీత. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ.. నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో తన గురించి గానీ.. తన కుటుంబసభ్యుల పై వచ్చే నెగిటివ్ కామెంట్స్ పట్ల సున్నితంగా వ్యవహరిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ కామెంట్స్ శ్రుతిమించితే వారికి తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటరిస్తుంది.
సునీత త్వరలో తల్లి కాబోతుందన్న రూమర్లు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతున్నాయి. అయితే గతంలో కూడా ఆమెపై ఇలాంటి పుకార్లు వచ్చినప్పటికీ.. వాటిని సునీత కొట్టిపారేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ రూమర్లపై సునీత స్పందించింది. ‘నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచనా స్థాయికి సంబంధించిన విషయం. నాకు కానీ, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు’ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.
కాగా ఈనెల 26వ తేదీన హైదరాబాద్ వేదికగా మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్ కన్సర్ట్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సునీత తన ప్రెగ్నెన్సీ వార్తలను కొట్టిపారేశారు. అంతేకాదు ఈ కన్సర్ట్‌లో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ తన అభిప్రాయాలను పంచుకుంది. ఇళయరాజా కన్సర్ట్ సంథింగ్ వెరీ స్పెషల్. కొత్తగా అని చెప్పను కానీ.. నాకెంతో స్పెషల్. ఒక సింగర్‌గా నేను ఈ కన్సర్ట్‌లో పాడబోతున్నందుకే కాకుండా.. ఇళయరాజా గారి వీరాభిమానిగా ఇది నాకు చాలా స్పెషల్’ అని చెప్పుకొచ్చారు సునీత.
మరోవైపు సునీత కొడుకు ఆకాశ్ టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘సర్కారు నౌకరి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్‌కే టెలీషో బ్యానర్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చూడాలి మరి ఆకాష్ అమ్మ లాగే ఈ ఫీల్డ్ లో సక్సెస్ అందుకుంటాడా? లేదా?? అని. ప్రస్తుతం సునీత కౌంటర్ మాత్రం ఫుల్ ట్రెండింగ్ గా దూసుకుపోతుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/