Site icon Prime9

Shamna Kasim wedding : దుబాయ్‌లో ఘనంగా జరిగిన నటి పూర్ణ పెళ్లి…వరుడు ఎవరంటే ?

purna wedding prime9video

purna wedding prime9video

Shamna Kasim wedding : వెండితెరకు పూర్ణగా పరిచయమైన ఈ మలయాళ ముద్దుగుమ్మ షమ్నా కాసిం కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.బ్యాచిలర్ జీవితానికి బై చెప్పి పెళ్లి చేసుకుంది.దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త, JBS గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకుడు, CEO షానిద్ ఆసిఫ్ అలీని షమ్నా కాసిం పెళ్లాడారు.వీరిద్దరి వివాహం సోమవారం దుబాయ్‌లో ఘనంగా జరిగింది.ఇరువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షమ్నా కాసిం, ఆసిఫ్ అలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా గ్రాండుగా నిర్వహించారు.

తన పెళ్లి ఫొటోలను షమ్నా కాసిం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు, ఈ పోస్ట్‌లో తన భర్తను ఉద్దేశించి తన మాటల్లో ఈ విధంగా ‘‘నేను ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిని కాకపోవచ్చు.మంచి జీవిత భాగస్వామికి ఉండాల్సి లక్షణాలు నాలో లేకపోవచ్చు.కానీ మీరు నన్ను నేను నాకంటే తక్కువ అనుకునేలా ఏనాడు ప్రవర్తించలేదు. మీరు నన్ను నన్నుగానే ఇష్టపడ్డారు . నన్ను మార్చడానికి మీరు ఏ రోజు ప్రయత్నించలేదు.నాలోని ఉత్తమ ప్రతిభను బయటికి తీసుకురావడానికి మీరు నన్ను చాలా ప్రోత్సహించారు.ఈ రోజు మనకెంతో ప్రియమైన, దగ్గరైన వారి మధ్య మీరూ, నేను కలిసి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మీతో కలిసి ప్రారంభించాను.ఎలాంటి కఠిన పరిస్థితుల్లో అయినా నేను మీకు అండగా ఉంటానని మీకు వాగ్దానం చేస్తున్నాను’’ అని కాసిం రాసుకొచ్చింది.

Exit mobile version