Site icon Prime9

Dunki Movie : పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన బాలీవుడ్ బాద్​షా “షారుక్ ఖాన్”..

shahrukh khan Dunki Movie teaser released

shahrukh khan Dunki Movie teaser released

Dunki Movie : బాలీవుడ్ బాద్​షా “షారుక్ ఖాన్” నేడు తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’, ‘లగేరహో మున్నాభాయ్’, త్రీ ఇడియట్స్, ‘పీకే’, ‘సంజు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘డంకీ’. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్ కుమార్ ఇరానీ ఫిలిమ్స్ అండ్ జియో స్టూడియోస్ నిర్మాణ సంస్థలపై షారుక్ భార్య గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీతో పోటీ పడబోతోంది. ‘డంకీ’ డిసెంబర్ 21న విడుదల అవుతుంటే, ‘సలార్’ మరుసటి రోజు అంటే డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇందులో షారుక్ తో పాటు తాప్సి, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. ఇక నేడు షారుఖ్ బర్త్ డే ని పురస్కరించుకొని ఈ మూవీ టీజర్​ను రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఈ టీజర్ ఆడియన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ ని గమనిస్తే.. ఒక గ్రూపు సభ్యులు ఉన్నతమైన జీవితం కోసం ఇంగ్లాండు వెళ్లాలని కలను నెరవేర్చుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ అని అర్థమవుతుంది. ఇంగ్లాండు వెళ్లేందుకు వారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఇల్లీగల్ గా దేశాన్ని దాటేందుకు సిద్ధమైన వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ గా మారింది. ఈ ఏడాది ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న షారుక్.. హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి మరి.

 

Exit mobile version