Site icon Prime9

Sankranthi: అల్లుడికి సంక్రాంతి విందు ఇచ్చిన గోదారివాసులు.. ఎన్ని రకాల వంటలో తెలిస్తే నొరెళ్ళబెట్టాల్సిందే?

sankranthi food items for godavari son in law

sankranthi food items for godavari son in law

Sankranthi: గోదావరి జిల్లాలోని ప్రజాలంటే మర్యాదకి పెట్టింది పేరు అని చెబుతూ ఉంటారు.

ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టకుండా బయటికి పంపించరు.

ఇక అలాంటిది కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఆ మర్యాదల గురించి చెప్పే పనేలేదు.

నూతన సంవత్సరంలో మొదటగా వచ్చే సంక్రాంతి(Sankranthi)కి అల్లడు వస్తే చేసే హడావుడి మామూలుగా ఉండదు.

ఇంటికి వచ్చిన అల్లుడికి ఒకటీ రెండు రకాల వంటకాలు కాదు.. ఏకంగా వందకుపైనే పిండి వంటలు చేసి వడ్డించటం అక్కడ షరామామూలు అయ్యింది.

ప్రతి సంవత్సరం అల్లుడికి పెట్టే వంటకాల సంఖ్యలో గోదావరి జిల్లా వాసులు పోటీ పడుతూనే ఉంటున్నారు.

కొత్త జంటను పక్క పక్కన కూర్చోబెట్టి భోజనం పెడతారు. వెరైటీ వంటకాలను తినేవరకు వదిలిపెట్టరు.

తాజాగా ఇలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది.

ఎన్ని రకాల వంటకాలు అంటే ..?

సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుడికి ఏకంగా 173 రకాల వంటకాలు వడ్డించి విందు భోజనం వడ్డించారు.

భీమవరానికి చెందిన వ్యాపారవేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతులు.. ఇటీవలే తమ కుమార్తె హారికను పృథ్వీ గుప్తాకు ఇచ్చి వివాహం జరిపించారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుడు ఇంటికి రావడంతో.. 173 రకాల వెరైటీ వంటకాలతో బాహుబలి భోజనం వడ్డించారు.

అత్తగారింట్లో మర్యాదలు చూసి సంతోషంతో అల్లుడికి కడుపు నిండిపోయింది.

కానీ అన్నీ రకాల వంటకాలను తినే వరకు వదిలే ప్రసక్తే లేదని మొత్తం తినిపించేశారు ఈ అత్తమామలు.

దీంతో గోదారోళ్ళతోమామూలుగా ఉండదు అంటూ ఈ విషయాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వార్త ట్రెండింగ్ గా మారింది.

ఇక ఈ రెండు రోజుల్లో ఈ రకంగా మరిన్ని వార్తలు రావొచ్చని భావిస్తున్నారు.

మొత్తానికి మర్యాదలతో గోదావరి వసూలు అదరగొడుతుండగా.. అల్లుళ్ళు మాత్రం అన్నీ రకాలు తినలేక కష్టపడుతున్నారు అనడంలో సందేహం లేదు.

గత ఏడాది ఏకంగా 365 వంటకాలతో విందు..

కాగా గత ఏడాది కూడా ఇలాంటి ఘటనే జరిగినది.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కాబోయే అల్లుడికి అత్తింటివారు 365 వంటకాలతో భోజనం పెట్టారు.

కాబోయే వధూవరులను పక్కన పక్కన కూర్చోబెట్టి కొసరి కొసరి తినిపించారు.

నరసాపురంకి చెందిన ఆచంట గోవింద్, నాగమణి దంపతులు తమ కూతురు అత్యం మాధవి, వెంకటేశ్వరరావు దంపతుల ఏకైక కుమార్తె కుందవి.

ఆమెను తణుకుకి చెందిన తుమ్మలపల్లి సాయి కృష్ణ నిశ్చితార్థం చేశారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో కాబోయే అల్లుడిని సంక్రాంతి భోజనానికి ఆహ్వానించారు.

అమ్మాయి తాతయ్య ఏకంగా 365 వంటకాలతో డైనింగ్ టేబుల్ మొత్తం ఏమాత్రం ఖాళీ లేకుండా అన్ని వంటకాలతో నిండిపోయింది.

అన్నం, పులిహార, బిర్యానీలు, దద్దోజనం వంటి వంటకాలు వండించారు.

30 రకాల కూరలు, వివిధ రకాల పిండివంటలు, 100 రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్ధాలు, 15 రకాల ఐస్ క్రీంలు, 35 రకాల డ్రింక్ లు, 35 రకాల బిస్కెట్లు, 15 రకాల కేకులతో విందు ఏర్పాటు చేశారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version