RRR Movie : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన సినిమా అంటే ఒక్క మాటలో అందరికీ గుర్తొచ్చేది “ఆర్ఆర్ఆర్”. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత్రంతో ప్రపంచానికి తెలుగు సినిమా పవర్ ఏంటో నిరూపించాడు. భారత దేశంలో అఖండ విజయం సాధించిన ఈ మూవీ.. ఎన్నో రికార్డులు సృష్టించింది. విదేశాల్లోనూ ఈ సినిమా రికార్డులతో పాటు ఎన్నో అవార్డులను సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరోసారి అవార్డుల వేటను కొనసాగించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించగా.. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో అద్బుతంగా నటించారు.
ఈ పీరియాడికల్ డ్రామా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టగా.. వాటిలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డులు కూడా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులలో ప్రధానోత్సవంలో ఆర్ఆర్ఆర్ అవార్డుల పంట పండించింది. ఏకంగా 5 కేటగిరీల్లో అవార్డులను కైవసం చేసుకుంది.
ఏ ఏ కేటగిరీల్లో అంటే (RRR Movie)..
ఈ అవార్డుల వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమాకి ‘బెస్ట్ స్టంట్స్’.. ‘బెస్ట్ యాక్షన్ మూవీ’.. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’.. ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’.. స్పాట్ లైట్ అవార్డులను.. సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ నుంచి రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణి, కార్తికేయ హాజరయ్యారు. కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు హెచ్ సీఏ స్పాట్ లైట్ అవార్డును సైతం దక్కించుకుంది. ఆయా కేటగిరీల్లో హాలీవుడ్ టాప్ స్టార్స్ నటించిన చిత్రాలు కూడా పోటీలో ఉండగా వాటిని వెనక్కినెట్టి.. ఆర్ఆర్ఆర్ ఆ అవార్డులను సొంతం చేసుకోవడం తెలుగు సినిమాకి మరింత గర్వ కారణం అని చెప్పాలి. ఇది కెవలమం తెలుగు సినిమా విజయం మాత్రమే కాదని ఇండియన్ సినిమా విజయమని చిత్ర యూనిట్ అంతా ముక్త కంఠంతో చెబుతున్నారు.
అలానే ఇంకోవైపు మార్చ్ 16న విడుదల కానున్న క్రిటిక్స్ సూపర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు అవార్డుకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నామినేట్ అయ్యారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా లోని “నాటు నాటు” సాంగ్ ఇప్పటికే ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఆస్కార్ అవార్డు కార్యక్రమంతో పాటు, ఆర్ఆర్ఆర్ ని హాలీవుడ్ లో రీ రిలీజ్ చేస్తుండటం.. మరిన్ని అవార్డు వేడుకలు ఉండటంతో ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్.. మరి కొంతమంది ప్రముఖులు అమెరికా లోనే ఉంటూ ఆ కార్యక్రమాలలో పాల్గొంటూ ఆర్ఆర్ఆర్ ని మరింత ప్రమోట్ చేస్తున్నారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీం ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/