Site icon Prime9

Rashmika: కాంగ్రెస్ ఎంపీగా నటి రష్మిక

Rashmika as Congress MP-Venu Swamy

Rashmika: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నటి రష్మికపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి రష్మిక గురించి మాట్లాడుతూ.. రష్మిక త్వరలో రాజకీయాల్లోకి రానుందని అన్నారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు వేణు స్వామి ఈ సందర్భంగా వెల్లడించారు.

రష్మిక తెలుగులో వరుస హిట్ చిత్రాలతో అతి తక్కువ కాలంలోనే టాప్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ’పుష్ప‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా ఆమె బాలీవుడ్ మూవీ గుడ్ బై ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఆమె ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

పాన్ ఇండియా స్థాయిలో రష్మికకు మంచి గుర్తింపు వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వేణుస్వామి చెప్పినట్లు ఆమె సినిమా రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వస్తారో లేదో చూడాలి.

Exit mobile version