Ram Charan Tej : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “వాల్తేరు వీరయ్య’.
ఈ మూవీలో శృతి హాసన్ చిరుకి జంటగా నటించింది.
అలానే రవితేజ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఇప్పటికే ఈ సినిమా దాదాపు 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సాలిడ్ హిట్ ని అందుకుంది.
విదేశాల్లో కూడా వాల్తేరు వీరయ్య సినిమా రికార్డు వసూళ్లు కలెక్ట్ చేస్తుంది.
తాజాగా వాల్తేరు వీరయ్య భారీ విజయం సాధించినందుకు వరంగల్ లో వీరయ్య విజయ విహారం పేరిట భారీ సభని నిర్వహించారు.
ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
అయితే ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఇన్ డైరెక్ట్ గా తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ..
సినిమా పెద్ద హిట్ చేసినందుకు, వింటేజ్ చిరంజీవిని చూపించినందుకు డైరెక్టర్ కి, అభిమానులకి ధన్యవాదాలు తెలిపాడు.
తమ్ముడంటే నాన్నగారికి ప్రాణం.. ఆ తమ్ముడు మీద ప్రేమ ఎలాంటిది అనేది వాల్తేరు వీరయ్యలో ఒక సీన్ లో తెలిసిపోతోంది.
ఫేస్ లెఫ్ట్ తర్కింగ్ ఇచ్చుకో అని తమ్ముడు అన్నాడు కాబట్టి ఊరుకున్నారు.
ఆ డైలాగ్ ఇంకెవరైనా అని ఉంటే ఏమయ్యేది. అది అన్నది ఆయన తమ్ముడు రవి కాబట్టి.. తమ్ముడంటే అంత ప్రేమ ఉంది కాబట్టి అలా ఊరుకున్నారు.
చిరంజీవి గారిని అనే హక్కు ఫ్యామిలీకి అభిమానులకు మాత్రమే ఉంది.
చిరంజీవి గారు ఆయన సైలెంట్ గా ఉంటారు, సౌమ్యులుగా ఉంటారు అని అంతా అంటారు.
ఆయన సైలెంట్ గా ఉంటేనే ఇంతమంది వచ్చారు. అదే ఆయన కొద్దిగా తెగించి మాట్లాడితే ఎంతమంది వస్తారు.
ఆయనని అనేవాళ్ళకి ఇది తెలీదు. ఆయన్ని ఏమన్నా అంటే ఫ్యామిలీ కానీ ఫ్యాన్స్ కానీ మాత్రమే అనాలి.
మాములుగానే చిరంజీవి గారు చాల క్వైట్ గా ఉంటారు..చాల సౌమ్యులు అంటారు.
ఆయన క్వైట్ గా ఉంటేనే ఇంత వేల మంది వచ్చారు అంటే.. ఇతరులకు తెలీదు ఆయన కొంచెం బిగించి గట్టిగా మాట్లాడితే ఎం అవుద్ది అని, గుర్తుపెట్టుకోండి.
మేము అందరం వెనకాల క్వైట్ గా ఉండము, క్వైట్ గానే చెబుతున్నాం మేము క్వైట్ గా ఉండమని, మేము అందరం వెనకాల క్వైట్ గా ఉండము.. క్వైట్ గానే చెబుతున్నాం మేము క్వైట్ గా ఉండమని, సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల మంత్రి రోజా చిరంజీవిపై, మెగా ఫ్యామిలీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఇప్పుడు వాల్తేరు వీరయ్య స్టేజిపై నుంచే రామ్ చరణ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/