Site icon Prime9

PM Modi: నరేంద్ర మోదీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారా?.. బీజేపీకి లాభం ఏంటి?

narendra modi

narendra modi

PM Modi: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు భాజపా తీవ్రంగా కృషి చేస్తోంది. దక్షిణాదిలో బలమైన పార్టీగా ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ నుంచి ప్రధాని మోదీ (PM Modi) పోటీ చేయనున్నట్లు టాక్ వస్తోంది. ప్రధానంగా తెలంగాణపై బీజేపీ నజర్ వేసినట్లు తెలుస్తోంది. మోదీ(PM Modi) -అమిత్ షా ద్వయం నేరుగా తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు.. భాజపా బలాబలాల గురించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం.

దక్షిణాదిలో గెలుపు సాధ్యమేనా?

దక్షిణ రాష్ట్రాల్లో ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ.. తర్వాతి టార్గెట్ తెలంగాణపై పెట్టింది.

ఇప్పటికే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా పోరాటం చేస్తున్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తోంది.

పాదయాత్రలు, ప్రభుత్వంపై పోరాటం ద్వారా పార్టీని బలపరుచుకుంటోంది. నిరంతరం ఏదోక సమస్య మీద కొట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ఉంటుంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రజా పోరాటాలకు అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్న బలం సరిపోదని, మరింత బలం పుంజుకోవాల్సిన అవసరం ఉందని కాషాయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణలో పార్టీని బలపరిచేందుకు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మోదీ (PM Modi)  పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

మహబూబ్ నగర్ భాజపాకు కలసివస్తుందా?

ప్రధానంగా మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి మోదీ (PM Modi)  పోటీ చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తను సమర్థించేలా ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన పోస్ట్ మరింత బలం చేకూర్చుతుంది. ఇప్పటికే ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయంపై ఇప్పటికే ఒకసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీక్రెట్ సర్వే చేయించినట్లు చెబుతున్నారు.

ఇక మహబూబ్ నగర్‌లో బీజేపీకి కూడా బాగా బలం ఉంది. గతంలో 1999 ఎన్నికల్లో వాజ్‌పేయి హయాంలో మహబూబ్‌నగర్ పార్ల‌మెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున జితేందర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2012లో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ తరపున ఎన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు.

 

ఇవి కూడా చదవండి:

ఇక వాల్తేరు ’విరాట్‘ ను చూడండి.. కింగ్ కోహ్లి బ్యాక్ ఇన్ యాక్షన్

‘శాకుంతలం’ ట్రైలర్.. కళ్లు చెదిరే విజువల్ వండర్ లో సమంత

నన్ను కార్నర్ చేసే సీన్ ఎవరికీ లేదు.. కానీ నా సినిమా రెండు రోజులు వాయిదా వేసుకున్నాను.. దిల్ రాజు

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version