CCTV: హైదరాబాద్ లో ఓ విచిత్రమైన కేసు నమోదయింది. పిల్లిని ఎత్తుకెల్లారంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాడు. వినడానికి, చదవడానికి కూడా ఆశ్చర్యంగా ఉన్న ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురం పరిధిలోని జహంగీర్ కాలనీలో షేక్ అజహర్ మహమూద్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇటీవలే ఒక అరుదైన జాతికి చెందిన పిల్లిని రూ. 50 వేలకు అతను కొనుగోలు చేశాడు. దానికి ఏమాత్రం లోటు లేకుండా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. స్వతహాగా జంతు ప్రేమికుడైన మహమూద్ ఆ పిల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు.
నా పిల్లిని ఎత్తుకెళ్లారు..
కాగా ఆ పిల్లికి ‘నోమనీ’ అనే పేరు కూడా పెట్టుకున్నాడు. ఈ పిల్లి వయస్సు ఇప్పుడు 18 నెలలు. అయితే ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ పిల్లిని ఎత్తుకుపోయారు. దీంతో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో సదరు వ్యక్తి పోలీసులకు పిల్లి పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం సీఐ కోలా సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సీసీటీవీ(CCTV) కెమెరాల ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామనీ వెల్లడించారు.
కాగా అసలు ఈ పిల్లి కోసం ఆ యువకుడు అంత చేయడానికి కారణం ఏంటని విషయం తెలిసిన వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. అయితే ఆ యువకుడు ఈ పిల్లి విషయంలో ఇంత హడావిడి చేయడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఈ పిల్లికి ఒక కన్ను గ్రీన్ కలర్ లో, మరొకటి బ్లూ కలర్ లో ఉండడమే. ఇలాంటి అరుదైన పిల్లి కాబట్టే అతను కేసు కూడా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ పిల్లిని ఎత్తుకెళ్లిన సీసీ టీవి ఫుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో ఒక యువకుడు స్కూటీ మీద వచ్చి అక్కడ ఉన్న పిల్లిని ఎత్తుకుని వెళ్ళడం గమనించవచ్చు. చూడాలి మరి ఆ పిల్లి ఎప్పుడు దొరుకుతుందో అని.
ఇవి కూడా చదవండి:
Kantara: బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”
MLA Vasantha Krishna Prasad: ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలి.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
Mahindra Thar: తక్కువ ధరలో మహీంద్రా థార్ సరికొత్త వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ ఇవే..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/