Pawan Sujeeth Combo: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఓ వైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే.. మరోవైపు సినిమాల్లో వేగం పెంచుతున్నారు. ఇదివరకే.. క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమా చేస్తున్న పవన్.. ఆ తర్వాత హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్ చేయాల్సి ఉంది. ఈ రెండు పట్టాలపై ఉండగానే.. మరో సినిమాకు పవన్ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. సాహో ఫేమ్.. సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
పవన్ కళ్యాణ్.. సుజిత్ కాంబినేషన్ లో సినిమా అనగానే.. అందరు ఓ రూమర్ అనుకున్నారు.
కానీ ఈ సినిమాపై డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారిక ప్రకటన కూడా చేసింది.
ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదలైంది. ఇందులో ‘they call him #OG’ అని పేర్కొన్నారు.
ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా తర్వాత.. డీవీవీ దానయ్య నుంచి వస్తున్న సినిమా కావడం విశేషం.
ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉండటంతో.. పవర్ స్టార్ మరో సినిమా చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం పవన్.. హరిహర వీర మల్లు అనే పీరియాడిక్ లో నటిస్తున్నారు.
దీని తర్వాత వెంటనే.. భవదీయుడు భగత్ సింగ్ చేయనున్నారు.
రన్ రాజా రన్.. సాహో వంటి చిత్రాలతో సుజిత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ సినిమా ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా పోస్టర్ ను గమనిస్తే.. పవన్ వెనకనుంచి.. ఓ ఫొటో కనిపిస్తుంది. ఇందులో ఉదయిస్తున్న సూర్యుడిని పవన్ చూస్తున్నట్లు తీర్చిదిద్దారు.
పోస్టర్ ఎర్రగా ఉండటంతో.. అగ్ని తుపాను వచ్చేలా అర్ధం ఉందటూ.. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో పవన్ (Pawan kalyan) ని వారు ఓజీ అని పిలుస్తారు.. దీని అర్ధం తెలియాలంటే.. మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
ఈ సినిమాకు సంబంధించి.. మరికొన్ని విషయాలు బయటకి రావల్సి ఉంది.
ఇందులో నటించే హీరోయిన్.. మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. పవన్ సుజిత్ కాంబోలో రాబోయో సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/