Janasena Party : పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ ప్రజల మద్దతును పొందేందుకు తనవంతుగా కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జనసేనాని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి, జనసేన పార్టీకి ప్రధాన బలం అంటే యువత అని చెప్పాలి. పార్టీ ఆరంభం నుంచి యువత పార్టీకి వెన్నెముక లాగా నిలబడుతున్నారు. తాజాగా మరోసారి ఆ విషయాన్ని ఓ యువతి బయటపెట్టింది.
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అంచులవారిపాలెం గ్రామంలో ముగ్గుల పోటీలు
రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైకాపా నేతలు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలలో అందరికీ షాక్ ఇచ్చిన జనసేన అభిమాని
జనసేన జెండా గుర్తుతో ముగ్గు వేసిన యువతి
వైసీపీ వద్దు – జనసేన ముద్దు…
ముఖ్యంగా ఆ ముగ్గు చుట్టూ “వైసీపీ వద్దు – జనసేన ముద్దు” అంటూ రాయడం హైలైట్ అని చెప్పాలి. వైసీపీ వారు పెడుతున్న ఈ పోటీలలో ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా తన అభిమానాన్ని చాటిన ఈ యువతిని జనసేన నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
జనసేన పార్టీ జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో “యువశక్తి” కార్యక్రమం నిర్వహించనుంది. సామాన్య యువతీ, యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నారు. దీనిలో పాల్గొనేందుకు జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీలోపు యువతీయువకులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు అని ప్రకటించారు. మీ పేరు, వివరాలు నమోదు చేయాల్సిన ఫోన్ నంబరు 08069932222, ఈ– మెయిల్ vrwithjspk@janasenaparty.org కు యువతీయువకులు ఏ అంశం మీద మాట్లాడాలి అనుకుంటున్నారో క్లుప్తంగా వాయిస్ రికార్డు చేసి వివరాలను పంపి జనసేనాని సమక్షంలో మీ గలాన్ని వినిపించండి అని వెల్లడించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/