Site icon Prime9

Unstoppable Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకి పండగే ఇక.. అన్ స్టాపబుల్ ప్రోమో వచ్చేసింది

pawan kalyan unstoppable glims

pawan kalyan unstoppable glims

Unstoppable Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ పండగే ఇక.. బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తున్న షో కు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక దానికి సంబంధించిన
గ్లింప్స్ ను ఆహా రిలీజ్ చేసింది.

తెలుగులో ఆహా ఓ వెలుగు వెలుగుతోంది. ప్రముఖ స్టార్లతో బాలయ్య నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కి విపరీతమైన క్రేజ్ వస్తుంది. నట విశ్వరూపం, సంభాషణలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే బాలయ్య హీరో, హీరోయిన్ లను ఇంటర్వ్యూ చేయడం అభిమానులకు సరికొత్త అనుభూతినిస్తుంది.

తొలి సీజన్ కు మంచి ప్రేక్షకాదరణ లభించిన.. రెండో సీజన్ మాత్రం ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. ప్రభాస్ ఎపిసోడ్ తో ఆహా అందరిచేత ఆహా అనిపించుకుంది.

ఈ సారి పవన్ కళ్యాణ్ రానుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. రెండో సీజన్‌ ను ఘనంగా ముగించేందుకు ఆహా ప్లాన్ చేసింది.

ఇందులో భాగంగానే చివరి ఎపిసోడ్‌ను పవర్‌ స్టార్‌(Unstoppable Pawan Kalyan)తో ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఆహా తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కేవలం 1.12 నిమిషాల మాత్రమే ఉంది. అయితే ఈ గ్లింప్స్ మాత్రం పనవ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది.

ఇందులో పవన్ కళ్యాణ్ ఎంట్రీ మాములుగా లేదంటూ.. ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. గ్లింప్స్‌లో బాలయ్య పవన్‌ ఉద్దేశిస్తూ.. ఈయన మెజర్‌మెంట్స్‌ తీసుకోవాలి అనడం..

దానికి బదులుగా పవన్ చిరునవ్వు చిందడం ఫ్యాన్స్‌ను థ్రిల్‌ చేసింది. ఈ వీడియోను ఆహా టీమ్ ఇలా రిలీజ్ చేయగానే అలా ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

పవన్ గ్లింప్స్ పై మరింత పెరిగిన అంచనాలు. గ్లింప్స్ కే పూనకాలు వస్తున్నాయంటూ ఫ్యాన్స్ ట్వీట్స్.

ఎపిసోడ్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో అని అభిమానుల్లో ఉత్కంఠ. షో స్ట్రీమింగ్ కోసం అభిమానుల ఎదురుచూపు.

త్వరలోనే ప్రసారం కానున్న పవర్ స్టార్ ఎపిసోడ్. అభిమానులకు సంక్రాంతి కానుక అందజేసిన ఆహా.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version