Site icon Prime9

Pawan kalyan In Unstoppable 2 : సాయి ధరమ్ తేజ్ గురించి ఆ సమయంలో చాలా బాధపడ్డా – పవన్ కళ్యాణ్ 

pawan kalyan in unstoppable 2 got emotional about sai dharam tej

pawan kalyan in unstoppable 2 got emotional about sai dharam tej

Pawan kalyan In Unstoppable 2 : బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే.

పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.

అన్ స్టాపబుల్ షో లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ నిన్న రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది.

ఈ ఎపిసోడ్ ఆద్యంతం అలరిస్తూ అందర్నీ మెప్పిస్తుంది.

ఈ సందర్భంగా పవన్ బాలయ్యల మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి.

వాటిలో ముఖ్యంగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి ప్రస్తావించవించడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే సాయి గురించి చెబుతూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

అవన్నీ వింటుంటే చాలా బాధేసేది : పవన్ కళ్యాణ్ (Pawan kalyan In Unstoppable 2)

2021 సెప్టెంబర్ లో సాయి ధరమ్ బైక్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలపాలైన సాయి ధరమ్ పరిస్థితి అత్యంత విషమంగా మారింది.

స్థానిక ఆసుపత్రిలో చేర్చిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. దాదాపు నెల రోజులు ఆసుపత్రి బెడ్ కే పరిమితమైన సాయి ధరమ్ తిరిగి కోలుకున్నారు.

ఈ సంఘటన తనను ఎంతగా కలచివేసిందో పవన్ కళ్యాణ్ ఈ షో లో వెల్లడించారు.

సాయి ధరమ్ కి యాక్సిడెంట్ జరిగిన విషయం నాకు త్రివిక్రమ్ ఫోన్ చేసి చెప్పారు. వెంటనే నేను ఆసుపత్రికి వెళ్ళాను. తన పరిస్థితి చూసి చలించిపోయాను.

ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతున్నా సాయి ధరమ్ కోమాలో నుంచి బయటకు రాలేదు. తనకు ఏమవుతుందనే ఆందోళనకు గురయ్యారు.

అంతకు మించి బయట జరుగుతున్న ప్రచారం మరింత కలచివేసింది. ఓవర్ స్పీడ్లో బైక్ నడిపారు. తాగి ఉన్నాడంటూ నిరాధార కథనాలు తెరపైకి తెచ్చారు.

అవన్నీ వింటుంటే చాలా బాధేసేది. సాయి ధరమ్ తేజ్ నా ముందు చాలా వినయంగా ఉంటాడు. అది నటన అని అనుకుంటారు.

చిన్నప్పటి నుండి వాళ్ళు అలానే పెరిగారని పవన్ చెప్పుకొచ్చారు. సాయి ధరమ్ గురించి మాట్లాడుతూ పవన్ కన్నీరు పెట్టుకున్నారు.

 

అలాగే పవన్ ని ఆశ్చర్యపరుస్తూ సాయి ధరమ్ తేజ్ ఈ షో లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ గురించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి నన్ను చదివించింది ఆయనే. నా చదువుకు అవసరమైన ఫీజులు కట్టేవారు.

ఆయనే నా బాధ్యత తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకు గురువుతో సమానం.

ముంబైలో యాక్టింగ్ నేర్చుకునే రోజుల్లో నేను ఫ్లైట్ మిస్సయ్యాను. ఆ విషయం పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి చెప్పాను.

నీకు డబ్బులు విలువ తెలియడం లేదురా… ఈసారి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్ళు అని నన్ను మందలించారు.

చిన్నప్పటి నుండి అలా క్రమశిక్షణగా పెంచారని సాయి ధరమ్ చెప్పుకొచ్చారు.

ఇక సాయి తేజ్ కూడా త్వరలోనే ఓ ఇంటివాడు కావాలని బాలకృష్ణ దీవించారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version