Site icon Prime9

Pawan Kalyan In Unstoppable 2 : ఓటీటీ రికార్డులు బద్దలుకొడుతున్న “పవన్ కళ్యాణ్” అన్‌స్టాపబుల్ ఎపిసోడ్..

pawan-kalyan-in-unstoppable-2 episode create records in ott telecast

balakrishna love towards pawan kalyan in unstoppable 2

Pawan Kalyan In Unstoppable 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పక్క సినిమాలతో పాటు మరోపక్క వ్యాఖ్యతగానూ అలరిస్తున్నారు.

అన్‌స్టాపబుల్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న ఈ షోపై ప్రేక్షకులకు విపరీతంగా స్పందిస్తున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గురువారం రాత్రి 9 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ ఎపిసోడ్‌ మొదటి భాగం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

ఈ ఎపిసోడ్ 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు ఆహా తెలిపింది.

ఈ సందర్భంగా పవన్ అభిమానులకు, ఆహా సబ్‌స్క్రైబర్లకు ధన్యవాదాలు తెలిపింది.

ఎపిసోడ్‌లో బాలయ్య తనదైన హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

పవన్ కూడా అదిరిపోయే రేంజ్ లో అలరించారు.

 

 

 

ఆహా’ ఓటీటీలో అత్యధిక వ్యూయర్ షిప్ తో సాగుతున్న ‘అన్ స్టాపబుల్ 2’ టాక్ షోలో పవన్ పాల్గొన్న ఫస్టు పార్టును నిన్న రాత్రి స్ట్రీమింగ్ చేశారు.

‘పవనేశ్వర .. పవరేశ్వరా’ అంటూ పవన్ ను బాలయ్య ప్రశంసించడం .. ఆయన మేనరిజంను ప్రత్యక్షంగా చూడాలని ఉందంటూ పట్టుబట్టడం ఈ ఎపిసోడ్ లో ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి.

అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ఇదే చివరి ఎపిసోడ్ కావడంతో.. భారీ రేంజ్ లో దీనిని ప్లాన్ చేశారు.

ఈ షో లో భాగంగా బాలకృష్ణ – పవన్ ల మధ్య జరిగిన ముచ్చట్లు అందరికీ తెగ నచ్చేస్తున్నాయి.

పవన్ తన వ్యక్తిగత జీవితంతో పాటు.. సినిమా విశేషాలను కూడా పంచుకున్నారు.

పవన్ చిన్ననాటి జీవితం.. సినిమా రంగంలోకి వచ్చిన మార్పులను అభిమానులకు తెలియజేశాడు.

తనలో జరిగిన మానసిక సంఘర్షణను పవన్ ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది.

ఒకానొక సమయంలో.. తను గన్ పట్టుకున్న సమయాన్ని కూడా పవన్ అభిమానులకు తెలిపారు.

రామ్ చరణ్.. సాయి ధరమ్ తేజ్ లకు పవన్ ఎలా సన్నిహితంగా మారారో ఇందులో చక్కగా వివరించారు.

రాజకీయాలు.. సమాజానికి చేయాల్సిన సేవను పవన్ ఈ షో లో తెలిపారు.

(Pawan Kalyan In Unstoppable 2) వాళ్ళు ఊరకుక్కలతో సమానం : బాలయ్య

ఈ పెళ్ళిళ్ళ గొడవేంటి భయ్యా?’ అన్న ప్రశ్నకు పవన్ ఏ మాత్రం దాచుకోకుండా అన్నీ వివరించిన విధానం కూడా అలరిస్తుంది.

అంతా విన్న తరువాత బాలయ్య, “ఇకపై పవన్ గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే మీరు ఊరకుక్కలతో సమానం” అంటూ అదిరిపోయే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఎపిసోడ్ లో వీరిద్దరి డైలాగ్స్ షో కి హైలైట్ గా మారాయి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ రికార్డులను తిరగరాస్తూ ఓటీటీ లో దూసుకుపోతుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version