Pawan Kalyan : నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సీజన్ 1 ని తనదైన శైలిలో బ్లాక్ బస్టర్ చేసిన బాలయ్య.. సీజన్ 2 ని ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నారు.
సెకండ్ సీజన్ లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ అభిమానులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది ఈ షో.
అయితే, ప్రజెంట్ అందరి చూపులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఎపిసోడ్ పైనా ఉన్నాయి
ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించి ఆహా అప్ డేట్ ఇచ్చింది.
యావత్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పవర్ స్టార్ పవన్ అన్‌స్టాపబుల్-2 పవర్‌ఫుల్ ఎపిసోడ్ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‌కు రానుంది.
బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ పేరుతో.. ఫిబ్రవరి 2 రాత్రి 9 గంటలకు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఈ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇప్పటికే షో నిర్వాహకులు ప్రకటించారు.
ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన అన్‌స్టాపబుల్ 2 పవర్‌ఫుల్ ఎపిసోడ్ ప్రోమోకు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది.
(Pawan Kalyan) పవన్ కళ్యాణ్ బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ కోసం స్పెషల్ టీం..
ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షో కి గెస్టుగా వచ్చారు. ఈ ఎపిసోడ్‌ను ప్రేక్షకులు ఏ రేంజ్ లో చూశారంటే.. దెబ్బకి ఆహా యాప్ కూడా క్రాష్ అయ్యేంతలా చేశారు.
ప్రభాస్ టాక్ షో ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేసింది ఆహా.
అయితే ప్రభాస్ ఎపిసోడ్ సంధర్భంగా యాప్ క్రాష్ అయిన విషయం తెలిసిందే.
దీంతో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అని ఆహా టీం ముందుగానే గ్రహించింది.
ఈ మేరకు ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా ఒక టీం పని చేస్తుందని తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు.
మరోవైపు సోషల్ మీడియా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ మానియా నడుస్తుంది.
పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ కోసం ఇప్పటికే పలు చోట్ల ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.
ఆహా టీం కూడా ట్విట్టర్ లో డీపీ కూడా మార్చి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ – బాలయ్య ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోని పెట్టడం విశేషం అని చెప్పాలి.
సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ ఎపిసోడ్ కి సంబంధించి మీమ్స్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.
We are all set and suuuppeerrr excited for #PawanKalyanOnAHA, baap of all episodes!🔥🔥🔥
Power fansuuu, Meeru ready e ga? 12hours to go! 🤟🏻#UnstoppableWithNBKS2 pic.twitter.com/WI1G6HoLj2— ahavideoin (@ahavideoIN) February 2, 2023
ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో పవన్ కళ్యాణ్ – బాలయ్య మధ్య ఆసక్తికర విషయాలు జరిగాయి.
ఈ గ్లింప్స్ లో తమ్ముడు సినిమాలో పవన్ చేసిన కొన్ని సన్నివేశాలు డూపా అని బాలయ్య అడిగారు.
బాలకృష్ణ ప్రశ్నకు పవన్ నవ్వుతూ సమాధానం చెప్పారు.
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ షో.
తన డైలాగ్స్, మేనరిజంతో షో ను ముందుకు తీసుకెళుతున్న బాలయ్య.
అయితే ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ ఈ షో కు హైలెట్ అవ్వనున్నాడు.
పంచెకట్టులో వచ్చిన సాయి ధరమ్ తేజ్ గ్లింప్స్ ఇది వరకే వైరల్ అయింది.
ఈ షో కొరకు పవన్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/