Pawan Kalyan – Sai Tej Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా ఫ్యామిలీ అభిమనులంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సముద్రఖని దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. కాగా ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ మేరకు స్టిల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మామ, అల్లుళ్ళు కలిసి ఉన్న ఫోటోలు అప్పుడు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అంతకు అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి ఎవడు సినిమా చేయగా.. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నాళ్ళకు మెగా హీరోలు ఇద్దరు కలిసి నటిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న (Pawan Kalyan – Sai Tej Movie) లీక్డ్ పిక్స్..
అయితే ఇటీవల కాలంలో స్టార్ హీరోలకు సంబంధించిన సినిమా షూటింగ్ ఫోటోలు ఎక్కువగా లీక్ అవుతూ వస్తున్నాయి. హీరో లుక్, సీన్స్ ను రహస్యంగా క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో లీకులు పెట్టేస్తారు. ఈ సమస్యను ప్రతి స్టార్ హీరో ఎదుర్కొంటున్నాడు. తాజాగా పవన్- తేజ్ సినిమాకు కూడా లీకుల బెడద తప్పలేదు. రీసెంట్ గానే ఘాట్ స్టార్ట్ చేసిన ఈ సినిమాకి కూడా లీకులు రావడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ ఫోటోల్లో ఒక ఫోటోలో పవన్ వెనుక తేజ్ నిలబడి ఉన్నాడు. పవన్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించగా.. తేజ్ డాక్టర్ డ్రెస్ లో కనిపించాడు.
Pls don’t leak the pics… Wait until for the official release… #PKSDT pic.twitter.com/i618HK9AgX
— Jaya kumar (@jaya94337) March 16, 2023
మరో ఫోటోలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ లో బ్లాక్ కలర్ షర్ట్ లో కనిపించగా.. కార్ లో ఆ సీన్ చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి అని చెప్పాలి. చూడాలి మరి మూవీ యూనిట్ ఏ విధంగా స్పందిస్తారో అని. కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది ‘వినోదయ సీతమ్’ సినిమా స్టోరీగా తెలుస్తుంది. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేయనుండగా.. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. దీంతో పవన్ దేవుడి పాత్రలో నటించడం ఇది రెండోసారి అవుతుంది. అంతకు ముందు విక్టరీ వెంకటేష్ తో కలిసి చేసిన ‘గోపాల గోపాల’లో.. పవన్ మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. కానీ,అందులో కూడా మోడ్రన్ దేవుడిలానే దర్శనమిచ్చాడు. ఈ మూవీతో మామ – అల్లుళ్ళు ఏ రేంజ్ లో అలరిస్తారో చూడాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ డైరెక్షన్ లో #OG సినిమాలు చేస్తున్నారు. పవన్ లుక్స్, సాయి తేజః లుక్స్ కి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతూ.. ఈ ఫోటోలను వరుసగా పోస్ట్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.