Oscar Nominations: ఆస్కార్ నామినేషన్లను మంగళవారం సాయంత్రం ప్రకటించనున్నారు. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ఈ వేడుక జరగనుంది. నామినేషన్లు ప్రకటన కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 95వ ఆస్కార్ నామినేషన్స్ కి ఈ వేడుక జరుగనుంది.
సినిమా రంగంలో అత్యుత్తమ అవార్డుగా ఆస్కార్ ను పరిగణిస్తారు. ఇది సినిమా రంగంలో అత్యున్నతమైన అవార్డ్. ప్రపంచంలో సినిమా తీసే ప్రతి ఒక్కరు ఈ అవార్డు కోసం కలలు కంటారు. కొన్ని సినిమాలు ఈ నామినేషన్స్ లో నిలిచిన చాలు అనుకుంటారు. అయితే ఈ ఏడాది అస్కార్ నామినేషన్స్ భారతీయులకి ఆసక్తిగా మారింది. దానికి కారణం.. దర్శకధీరుడు తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రపంచం మొత్తం మన తెలుగు సినిమాను మెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందా అని భారతీయులు ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఆస్కార్ కు క్వాలిఫై లిస్ట్ లో పలు ఇండియన్ సినిమాలు నిలిచాయి.
ఆస్కార్ నామినేషన్స్ లో మాత్రం ఆర్ఆర్ఆర్, చెల్లో షో, ఆల్ దట్ బ్రీత్స్ సినిమాలకు చోటు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
అమెరికన్ టైం ప్రకారం ఉదయం ఉదయం ఈ నామినేషన్స్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంటే మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.
తెలుగు ప్రేక్షకులు మాత్రం.. ఆర్ఆర్ఆర్ RRR తప్పకుండా ఆస్కార్ బరిలో నిలుస్తుందని భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు.. హాలీవుడ్ అవార్డులు గెలుచుకుంది. ఆర్ఆర్ఆర్ అభిమానులు, ఇండియన్ ప్రేక్షకులు నామినేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
నాటు నాటు.. లేదా ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ కు ఎంపికయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
మరో వైపు తన అద్భుత నటనతో అలరించిన ఎన్టీఆర్ ఆస్కార్ కు నామినేట్ అవుతారని తెలుస్తుంది.
ఎన్టీఆర్ ఆస్కార్ నామినేట్ కావాలంటూ ట్వీట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్.. ఆస్కార్ బరిలో నిలుస్తాడని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/