Site icon Prime9

VNR Trio : మళ్ళీ చేతులు కలిపిన బ్లాక్ బస్టర్ టీమ్.. మా మనోభావాలు మేమే దెబ్బ తీసుకుంటాం

nitin, rashmika and venky kudumula joins for new movie and vnr trio video released

nitin, rashmika and venky kudumula joins for new movie and vnr trio video released

VNR Trio : యంగ్ హీరో నితిన్, రష్మిక కలిసి నటించిన సినిమా ‘భీష్మ’. 2020 లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. వరుస వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కి ఈ మూవీ మంచి హిట్ ఇచ్చిందని చెప్పాలి. కాగా ఇప్పుడు ఈ ట్రియో కాంబినేషన్ మరోసారి చేతులు కలినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఉగాది కానుకగా వీరు చేయబోతున్న సినిమా గురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే ఒక వీడియోని రిలీజ్ చేశారు. దాదాపు 4 నిముషాల నిడివి ఉన్న ఈ వీడియోలో నితిన్, రష్మిక మధ్య సంభాషణలు అందర్నీ అలరించేలా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ మీద వాళ్ళే ట్రోల్స్ చేసుకోవడం హైలైట్ అని చెప్పాలి. “వెంకీ కుడుముల – నితిన్ – రష్మిక”  “వీఎన్‌ఆర్‌ ట్రియో” గా ప్రకటించారు దర్శకుడు వెంకీ కుడుముల.

ఆ వీడియోలో (VNR Trio)..

ఇందులో మొదట ఎవరి మనోభావాలు మేం దెబ్బతీయట్లేదు, మా మనోభావాలు మేమే దెబ్బతీసుకుంటున్నాం, ధన్యవాదాలు` అని రష్మిక, నితిన్‌ చెప్పగా, అనంతరం సెట్‌కి నితిన్‌ కోక్‌ తాగుతూ వచ్చారు. ప్రభా.. ఇంకా ఎవరురాలేదా? అని బాయ్‌ని అడగ్గా, మార్నింగ్‌ 8 గంటలకు హీరోయిన్‌ వచ్చార్‌ సర్‌ అని చెప్పాడు. దీంతో `సేమ్‌ హీరోయినా` అని ప్రశ్నంచగా, లోపలి నుంచి `సేమే యే.. `అంటూ రష్మిక బయటకు వచ్చింది. `అస్సలు డౌట్‌ లేదని, మా డైరెక్టర్‌ స్క్రిప్ట్ రాసేముందు ఓంలో మీ పేరే రాస్తాడు` అని చెప్పాడు. ఏంటి 8గంటలకే వచ్చావని నితిన్‌ ప్రశ్నించగా, మార్నింగ్‌ బాంబే ఫ్యాన్స్ తో లైవ్‌ పెట్టుకున్నా, ఈ షూట్‌ అయ్యాక ఈవినింగ్‌, హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు, కొచ్చి ఫ్యాన్స్ తో అని చెప్పబోతుండగా.. ఓకే ఓకే నేషనల్‌ క్రష్‌వి కదా ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటుంది అని నితిన్ అన్నాడు. వెంటనే లైవ్ ఏ నా ఏదైనా కాంట్రవర్సీ కూడా నా అని అడగబోతుండగా.. అవి మాత్రం వద్దు.. నేను ఒక్క మాట మాట్లాడితే 2, 3 కాంట్రవర్సీ అవుతున్నాయి అని తనకు తానే పంచ్ వేసుకుంది. నితిన్ కూడా నేను ఒక హిట్ ఇస్తే 2,3 ఫ్లాప్ లు వస్తున్నాయ్ అని అన్నాడు. ఇక రష్మిక శ్రీవల్లి డాన్సు చేయడం.. దాంతో నితిన్‌ మళ్ళీ అదే స్టెప్ ఆ అని అడుగుతాడు. అందుకు రష్మిక సక్సెస్ అయ్యింది కదా అని చెప్తుంది. సక్సెస్ ని నువ్వు వాడుకున్నట్లు.. నేను వాడుకొని ఉంటే ఎక్కడో ఉండే వాడిని అని తనకు తానే కౌంటర్ వేసుకున్నారు.

ఇంతలో జీవి ప్రకాష్‌ ఎంటర్‌ అయ్యారు. ఆయన హీరోగా మేకప్‌ వేసుకుంటుండగా, నేను హీరో అని నితిన్‌ చెప్పడంతో ఓకే ఈ సారికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ గానే ఫిక్స్ అయిపోతా అనిచెప్పడం ఆకట్టుకుంది. ఆ తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల ఎంట్రీ ఇచ్చి తమ కాంబినేషన్‌ ప్రకటించారు. ఈ సారి అంతకు మించి ఉంటుందని చెప్పారు. దీంతో `వీఎన్‌ఆర్‌ట్రియో`ని ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా `భీష్మ`కి మించిన వినోదాత్మకంగా, అంతకు మించిన అడ్వెంచరస్‌గా ఉంటుందని, భారీ బడ్జెట్‌తో సినిమాని నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇక రష్మిక ప్రస్తుతం తెలుగులో `పుష్ప2`లో నటిస్తుంది. హిందీలో `యానిమల్‌` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version