Nijam With Smitha Talk Show : ప్రస్తుతం టాక్ షో లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.
భాషతో సంబంధం లేకుండా సినీ, రాజకీయ ప్రముఖుల పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
అన్ని టాక్ షో ల రికార్డులను బద్దలు కొడుతూ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో దుమ్మురేపుతుంది.
ఆహా వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో రికార్డులను తిరగరాస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
కాగా ఇప్పుడు తాజాగా ప్రముఖ పాప్ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా కొత్త టాక్ షో చేయబోతున్న విషయం తెలిసిందే.
‘నిజం విత్ స్మిత’ అనే పేరుతో వస్తున్న ఈ షో నిజాన్ని నిర్భయంగా అనే ట్యాగ్ లైన్ తో వస్తుంది.
ఇటీవలే ఈ టాక్ షోకి సంబంధించిన ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు.
ఆ ప్రోమోలో సినీ, రాజకీయ ప్రముఖులు రావడం గమనించవచ్చు.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నారా చంద్రబాబు నాయుడు, నాని, రానా, సాయి పల్లవి, సీనియర్ నటి రాధిక, అడవి శేష్ ఇలా పలువురు ఆ ప్రోమోలో కనిపించి సందడి చేశారు.
ఈ షో ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ సోనీ లివ్ లో ప్రసారం కానుంది.
ఫిబ్రవరి 10 నుంచి ఈ టాక్ షో ప్రసారం కానున్నట్లు తెలుస్తుంది.
ఆరోజు అలా గుడ్లు వేశారంటూ (Nijam With Smitha Talk Show)..
ఈ మేరకు ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది సోనీ.. తాజాగా ఈ షో కి ఫస్ట్ గెస్ట్ గా రానున్న మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు.
ఇక ఫస్ట్ ఎపిసోడ్ లో చిరంజీవి జీవితంలో ఉన్న ఎన్నో తెలియని విషయాలను, నిజాలను స్మిత బయట పెట్టబోతోందని అర్దం అవుతుంది.
ఈ క్రమంలోనే కాలేజీ టైంలో చిరు క్రష్ గురించి, రాజకీయంలో జరిగిన సంఘటనలు, అవమానాలు గురించి చిరు ఓపెన్ అయ్యారు.
ఒక కామన్ మ్యాన్ గా వచ్చి చిరంజీవిలా ఎదిగే పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది అంటారా? అంటూ స్మిత ప్రశ్నించడంతో షో పట్ల అందరికి అంచనాలను పెంచేస్తుంది.
అలాగే చిరంజీవి కూడా సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో తన కులం ఏంటని అడిగేవారు అంటూ చెప్పుకొచ్చాడు.
ఫిబ్రవరి 10న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ప్రస్తుతం చిరు ప్రోమో సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది.
కాగా ఈ షోలో పాల్గొంటున్న అందరి గెస్ట్ లను కలిపి ఒక ప్రోమో రిలీజ్ చేశారు.
ఆ ప్రోమోలో చంద్రబాబు ఎన్టీఆర్ వెన్నుపోటు మరియు రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు.
ముఖ్యంగా చంద్రబాబు.. కేసీఆర్ గురించి మాట్లాడడం హైలైట్ అని చెప్పవచ్చు.
హీరో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ‘రామ్ చరణ్ మొదటి సినిమా కోటి మంది చూశారు. చూసిన వారే కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తుంది’ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
చూడాలి మరి ఈ షో ఆడియన్స్ ని ఎంత మేర ఆకట్టుకుంటుందో అని..