Site icon Prime9

Nara Lokesh Birthday: వినూత్న రీతిలో నారా లోకేష్ బర్త్ డే.. ఫోటో వైరల్

Lokesh birthday

Lokesh birthday

Nara Lokesh Birthday: నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయనకు పట్టినరోజు శుభాకాంక్షలు వివిధ పద్ధతుల్లో చెబుతున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఓ అభిమాని నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఫోటో వైరల్ గా మారింది.

ఇప్పటి వరకూ సినీ నటీనటులకు, క్రీడాకారులకు ఇలాంటి అభిమానాన్ని చూశాం. కానీ ఇలాంటి అభిమానం రాజకీయ నాయకులకు ఉంటుంది అని నిరూపించాడు ఓ యువకుడు. టీడీపీ యువనేత నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకను వినూత్నరూపంలో చాటాడు పులి చిన్నా అనే లోకేష్ అభిమాని. ఈ పుట్టిన రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడు.

ఓ అభిమాని ఏకంగా.. ఎకరం పొలంలో వరినారుతో నారాలోకేష్ ముఖ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.

లోకేష్ పుట్టిన రోజు కోసమే ఈ పంటను పండించినట్లు ఆ అభిమాని తెలిపాడు.

దాదాపు వంద రోజులపాటు ఈ పంటను జాగ్రత్తగా కాపాడినట్లు తెలిపాడు.

ఈ పండించిన ధాన్యాన్ని లోకేష్‌ తల్లి భువనేశ్వరికి అందిస్తానని ఆ విరాభిమాని తెలిపాడు.

తాను చిన్ననాటి నుంచే లోకేష్ అభిమాని అని పులి చిన్నా వ్యక్తి తెలిపాడు.

గుంటూరుజిల్లా తెనాలి సమీపంలోని కూచిపూడి గ్రామానికి చెందిన రైతు తెదేపాకు పెద్ద అభిమాని.

టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ పుట్టినరోజును ఈ ఏడాది వినూత్న రీతిలో చేయాలని నిశ్చయించుకున్నాడు.

దీంతో ఎకరం పొలంలో వరినారుతో లోకేష్ ముఖ చిత్రాన్ని రూపొందించాడు.

సుమారు వంద రోజులపాటు ఈ పంటను కాపాడినట్లు యువకుడు పేర్కొన్నాడు.

వరినారుతో రూపొందించిన లోకేష్ ముఖ చిత్రాన్ని.. డ్రోన్ సాయంతో చిత్రీకరించాడు.

పంట లోకేష్‌ ముఖం ఆకారంలో ఉండటం ఆ వీరాభిమాని ఆనందానికి హద్దు లేకుండా పోయింది.

ఇక అక్కడి ప్రాంత వాసులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటో తెదేపా అభిమానులను అమితంగా ఆకర్షిస్తుంది.

ఈ సందర్భంగా యువకుడు మాట్లాడుతూ.. అమరావతి రాజధాని ఉద్యమంలో అనేకసార్లు లాఠీ దెబ్బలు తిన్నానని పేర్కొన్నాడు.

ఆ పోరాట స్పూర్తికి లోకేష్ ఇచ్చిన ధైర్యమే ఈ అభిమానానికి కారణం అని చెప్పాడు.

నేడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్‌లో దేశ వ్యాప్తంగా #HBDYoungLeaderLokesh హ్యష్ టాగ్ ట్రెండ్ అవుతోంది.

టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున నారా లోకేష్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version