Site icon Prime9

Megastar Chiranjeevi : కష్టాల్లో ఉన్న సినిమాటోగ్రాఫర్‌కి “ఆపద్బాంధవుడి”లా.. 5 లక్షల ఆర్ధిక సాయం అందించిన మెగాస్టార్ చిరంజీవి

megastar-chiranjeevi financial help to cinematographer devaraj

megastar-chiranjeevi financial help to cinematographer devaraj

Megastar Chiranjeevi : ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మొదట గుర్తొచ్చే పేరు మెగా ఫ్యామిలీ.

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్థిరపడ్డ ఎన్నో పెద్ద కుటుంబాలు ఉన్నాయి.

ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా పదవులు, పలుకుబడి అనుభవించినవారు, అనుభవిస్తున్నవారు ఉన్నారు.

అయినా కష్టం అంటే గుర్తొచ్చే పేరు మెగా ఫామిలీ.

వారిని విమర్శించిన వారికి సైతం అవసరం అని గడప తొక్కితే ఆదుకునే మనస్తత్వం వారిది.. తాజాగా మరోసారితన మంచి మనసు చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

సినీ పరిశ్రమలో ఒకప్పుడు గొప్పగా బ్రతికిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇప్పుడు దీన పరిస్థితిలో సహాయం కోసం వేచి చూస్తున్నారు.

పలు ఇంటర్వ్యూలు ద్వారా వీరి పరిస్థితి తెలుసుకున్న ఇండస్ట్రీలోని ప్రముఖులు వారికీ చేయూతను అందిస్తున్నారు.

తాజాగా ఒకప్పటి టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ పి దేవరాజ్ పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆర్ధిక సహాయం చేశాడు.

 

(Megastar Chiranjeevi) ఎందుకు బ్రతికున్నానో అంటూ కన్నీరు పెట్టుకున్న దేవరాజ్..

 

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో దాదాపు 300 కు పైగా సినిమాలకు కెమెరా మ్యాన్ గా పనిచేసిన దేవరాజ్.. ప్రెజెంట్ ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దేవరాజ్ మాట్లాడుతూ.. ‘నేను జయప్రద, ప్రభ, విజయశాంతి వంటి హీరోయిన్ లకు ఎన్నో సినిమాలు రికమెండ్ చేశాను.

కానీ వాళ్ళు ఎవరు నాకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. నా స్నేహితుడు రజినీకాంత్ నెలకి రూ.5000 ఖర్చులకు పంపిస్తాడు.

నటుడు మురళీ మోహన్ టాబ్లెట్స్ కోసం ఒక రూ.3000 పంపిస్తాడు. నాకు ఆపరేషన్ చేయాలి. అందుకు సుమారు 7 లక్షలు ఖర్చు అవుతుంది.

ప్రస్తుతం నేను ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నాను. నేను ఎందుకు బ్రతికి ఉన్నానో తెలియక చచ్చిపోవాలి అనిపిస్తుంది’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

ఇక ఆయన పరిస్థితిని తెలుసుకున్న చిరంజీవి దేవరాజ్ కి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం చేశాడు.

ఇక ఈ వార్త తెలుసుకున్న మెగా అభిమానులు జై చిరంజీవ అంటున్నారు. కాగా ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు కూడా త‌న ఉదార‌త చాటుకున్నారు.

పాకీజా పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న నటి ‘వాసుకి’ ఆర్ధిక పరిస్థితి ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్న నాగబాబు లక్ష రూపాయిలు సాయం అందించాడు.

టాలీవుడ్ లో పెద్దపెద్ద నటీనటుల నుంచి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్న వారందరికీ మెగా ఫ్యామిలీ ఎన్నో సందర్భాల్లో సాయంగా నిలబడింది.

సినీపరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ పెద్దదిక్కు అంటే గుర్తొచ్చేది మెగాస్టార్ అనడంలో అతిశయోక్తి కాదు.

కరోనా సమయంలో చిరు చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కరోనా క్రైసిస్ ఛారిటీ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు నిత్యావసరాలు హెల్త్ కిట్స్ వ్యాక్సిన్స్ పంపిణీ చేశారు.

ఇవే కాకుండా సినీ జర్నలిస్టులకు ఎన్నో విధాలుగా సాయపడ్డారు.

చిరు బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేస్తూ ఎన్నో కోట్ల మంది ప్రాణాలను కాపాడుతోన్నారు.

సాయం బయటకు చెప్పకుండా మరెంతో మందికి అండగా నిలుస్తూ తమ గొప్ప మనసు చాటుకుంటుంది మెగా ఫ్యామిలీ.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నిరుపేద ముసలమ్మ దగ్గర నుంచి గొప్పగొప్ప సినీ ప్రొడ్యూసర్ల వరకు ఆయన సేవాహృదయాన్ని కొనియాడని వారుండరు.

అభిమానులకు కూడా ఎంతో మందికి అండగా నిలిచారు మెగాస్టార్.. నిలుస్తారు అని చెప్పడంలో కూడా సందేహం అక్కర్లేదు అని చెప్పవచ్చు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version