Mega Brother Nagababu : అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పాత్రలో నటించి మెప్పించారు వాసుకి.
వాసుకీ అలియాస్ పాకీజా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.
వాసుకీ అనే కంటే కూడా పాకీజా అంటేనే ఎక్కువ మంది గుర్తిస్తారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఎన్నో అద్భతమైన సినిమాల్లో నటించారు.
కాలక్రమేణ ఆవిడ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ఇండస్ట్రీకి దూరమైపోయారు.
ఇప్పుడు అవకాశాలు లేక, కనీసం తినడానికి తిండిలేక ఎంతో దయనీయ పరిస్థితిలో ఉన్నారు.
ఇటీవల ఓ మీడియా ఛానల్ చేసిన ఇంటర్వ్యూ ఆధారంగా తన కన్నీటి గాధను వెల్లబుచ్చుకున్నారు. ఆ
వీడియో నెట్టింట వైరల్ కావడంతో పాకీజాకు సాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారు.
ఇప్పుడు ఆమెకు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఆర్ధిక సాయం చేసి అండగా నిలిచారు.
ఇటీవల ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు పాకీజా పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
దీంతో వెంటనే నాగబాబు ఆమెకు ఆర్ధికంగా సహాయం చేశారు.
నటి వాసుకికి ఆర్ధిక సాయం అందించిన నాగబాబు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకీజాగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఆర్టిస్టు ఇప్పుడు ఇలా కష్టాల్లో ఉండటం చూస్తే బాధగా ఉంది అన్నారు.
బుల్లితెర కానీ, సినిమాల్లో కానీ.. చిన్నదో పెద్దదో ఒక పాత్ర ఆవిడకు ఇచ్చి మళ్లీ తన కాళ్ల మీద తాను నిలబడేందుకు పరిశ్రమ వారు సాయపడాలి.
నేను కూడా నావంతు ప్రయత్నం చేస్తాను’’ అన్నారు.
అలాగే ఆమెకు లక్షరూపాయల ఆర్ధిక సాయం అందించారు నాగబాబు.
నాగబాబు సాయం అందించారని తెలుసుకొని పాకీజా సంతోషం వ్యక్తం చేశారు.
ఆయన ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతా అని అన్నారు. తమిళ్ లో నన్ను పట్టించుకోలేదు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. ఇప్పుడు నేను ఒక ముద్ద తింటున్నాను అంటే అది తెలుగువాళ్లు వల్లే అంటూ ఎమోషనల్ అయ్యారు పాకీజా.
అయితే తాను సాయం చేశారనే విషయాన్ని చెప్పేందుకు మొదట నాగబాబు ఒప్పుకోలేదు.
కానీ తాను ఆయమ చేసినట్లు తెలిసిన తర్వాత అలా అయినా మరికొంత మంది సాయం చేసేందుకు ముందుకొస్తారనే ఆలోచనతో బయటపెట్టినట్లు తెలిపారు.
అలానే ఆ ఇంటర్వ్యూ జరిగే సమయంలోనె నాగబాబు- వాసుకీతో వీడియో కాల్ లో మాట్లాడారు.
నాగబాబు సాయం చేశారని తెలుసుకుని ఆవిడ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రస్తుతం ఈ వీడియోని షేర్ చేస్తూ మెగా అభిమానులు మెగా ఫ్యామిలీ ఎప్పుడు అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడుతుందని పోస్ట్ లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో వైకాపా మంత్రి రోజా మెగా ఫ్యామిలీపై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
వారి కుటుంబం ఎవరికి సాయపడలేదని.. రాజకీయాలలో కూడా ఎవరూ రాణించలేకపోయారని ఆరోపించింది.
అందుకు గాను రోజా మెగా అభిమానుల ఆగ్రహానికి కూడా గురైంది.
ఇటీవలే వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇన్ డైరెక్ట్ గా ఆమెపై సెటైర్లు వేశారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/