Site icon Prime9

RT4GM Movie : రవితేజ – గోపి చంద్ మలినేని మూవీకి బ్రేక్.. కారణం అదే ?

latest news about ravi teja and gopichand malineni combination movie

latest news about ravi teja and gopichand malineni combination movie

RT4GM Movie : రవితేజ .. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని జయాపజయాలతో సంబందం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవల దసరా కి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో వచ్చి పర్వాలేదనిపించాడు త్వరలో సంక్రాంతికి ‘ఈగల్’ సినిమాతో రాబోతున్నాడు మాస్ మహారాజ. ఆ తర్వాత గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో సినిమా ప్రకటించి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

గోపీచంద్ మలినేని – రవితేజ కాంబోలో ఇప్పటివరకు వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ కాంబినేషన్ పై రవితేజ అభిమానులతో పాటు సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సినా ఇంత వరకు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు . దీనితో ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ అయితే వాయిదా వేశారు. ఇందుకు కారణం బడ్జెట్ అని తెలుస్తుంది.

‘ధమాకా’ తర్వాత వచ్చిన రవితేజ రెండు సినిమాలు ఆశించినంత విజయం సాధించకపోవడం, ఈ సినిమాలో పాన్ ఇండియా యాక్టర్లు, వేరే పరిశ్రమల నుంచి స్టార్స్ ని గోపీచంద్ అడగడంతో అనుకున్న దానికంటే బడ్జెట్ పెరగడంతో పాటు, ఏ ఓటీటీ కూడా ఈ సినిమాని తీసుకోవడానికి ఇంకా ముందుకు రాకపోవడం తో ఈ సినిమా షూటింగ్ ని వాయిదా వేశారని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది .దీనికి బడ్జెట్ అనుకున్న దానికి మించి పెరగడం ముఖ్య కారణం .ఏదైనా ఓటీటీ సినిమా డిజిటల్ రైట్స్ ముందే కొనుక్కుంటే నిర్మాతలు కొంచెం ధైర్యంగా భర్తీ బడ్జెట్ సినిమాలకు వెళ్తున్నారు. ఒకవేళ థియేట్రికల్ లో లాస్ వచ్చినా నాన్ థియేట్రికల్ లో సేవ్ అవుతామని భావిస్తున్నారు. ఇప్పుడు రవితేజ సినిమాకు అనుకున్న దానికంటే బడ్జెట్ పెరగడం, ఇంకా ఏ ఓటీటీ సినిమా అరైట్స్ కోసం ముందుకు రాకపోవడం వల్లే రవితేజ – గోపీచంద్ సినిమా ఆగిందని వార్తలు వస్తున్నాయి.

 

Exit mobile version