Site icon Prime9

Singer Vani Jayaram : ప్రముఖ గాయని వాణీ జయరాం – లతా మంగేష్కర్ కి మధ్య గొడవకి కారణం ఏంటో తెలుసా?

intersting details about clash between vani jayaram and latha mangeshkar

intersting details about clash between vani jayaram and latha mangeshkar

Singer Vani Jayaram : ప్రముఖ గాయని వాణీ జయరాం ఆకస్మిక మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

దాదాపు 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు ఈ మధుర గాయని.

ఆమె తెలుగులో పాడింది తక్కువ పాటలే అయినప్పటికీ.. అద్భుతమైన పాటలు ఆలపించి తెలుగు వారి మదిలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

ముఖ్యంగా డైరెక్టర్ కె.విశ్వనాద్ శంకరాభరణం సినిమాలో దొరకునా ఇటువంటి సేవా.. అంటూ ఆమె ఆలపిస్తుంటే శ్రోతల హృదయాలు పరవశం అయ్యాయి.

హిందీ సినిమాల్లో ఎన్నో వేల పాటలు పాడి.. కొన్నేళ్ల పాటు అక్కడ అగ్రస్థానంలో కొనసాగారు.

ఈ క్రమంలోనే అక్కడ ఎదురైన చేదు అనుభవాలు తట్టుకోలేక మళ్లీ మద్రాసుకు వచ్చేసినట్లు గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో వాణీ తెలిపారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర గాయనీమణులుగా చెప్పుకునే వారిలో ఆమె ఒకరు. ఆమె అకాల మరణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా దుఃఖంలో మునిగిపోయింది.

అలాగే లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ తో వాణీ జయరాంకి మధ్య జరిగిన గొడవ గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు.

ఆ తరుణం లోనే అసలు వారి మధ్య గోడవకి కారణాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా…

 

వాణి జయరాం – లతా మంగేష్కర్ మధ్య గోడవకి కారణం ఆ సినిమానేనా..?

లెజండరీ సింగర్ లతా మంగేష్కర్‏ వాణి జయరామ్ మధ్య మనస్పర్థలు వచ్చాయి.

దీంతో క్రమంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. గతంలో ఈ వీరి మధ్య గొడవ వచ్చిన వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

“నా పాటలు మంచి ఆదరణ పొందేసరికి తనకు ఎక్కడ పోటీగా వస్తానోనని భావించారు.

గుడ్డిలో నా పాటలు ప్రజాదరణ పొందాక.. ఆమె ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్లాను.

కాకపోతే నన్నుకలవడానికి ఆమె ఆసక్తి చూపించలేదు. 1979లో విడుదలైన మీరా మా మధ్య మరింత దూరాన్ని పెంచింది.

మీరా చిత్రానికి పండిట్ రవిశంకర్ ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు డైరెక్టర్ గుల్జార్.

అయితే లతా మంగేష్కర్ కు నచ్చలేదు. తన సోదరుడిగా మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోకపోతే ఈ సినిమాలో తాను పాటలు పాడనని చెప్పారు.

దాంతో గుల్జార్ నాతో ఆ సినిమాలోని పాటలన్నీ పాడించారు. అలా లతాజీకి నాపై కోపం ఎక్కువైంది.

కొన్నాళ్లకు బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకీయాలు చూసి విసుగు వచ్చేసి మద్రాసు తిరిగి వచ్చేశాను” అంటూ చెప్పుకొచ్చారు.

 

అలాగే తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ కాకపోవడానికి గల కారణాన్ని తెలియజేశారు.

తమిళ్, కన్నడ, మలయాళంలో కంటే తెలుగులో చాలా తక్కువ పాటలు నా వరకు వచ్చాయి.

11 సంవత్సరాలు దక్షిణాదిలో నెంబర్ వన్ సింగర్ నేనే. కానీ తెలుగులో మాత్రం కాద తమిళంలో రెండు పాటలు పాడితే.. తెలుగులో కేవలం ఒక్క పాట మాత్రమే పాడాను.

నా పీరియడ్ తర్వాత చిత్రకు అనేక పాటలు ఇచ్చారు. ఇక్కడ ఏ సింగర్ తో నాకు ఎలాంటి సమస్య రాలేదని అన్నారు.

ప్రస్తుతం వాణీ జయరాం మాటలు నెట్టింట వైరలవుతున్నాయి.

ఇటీవలే ఈమెకు భారత్ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఇక సింగర్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు సార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు.

మరికొద్ది గంటల్లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version