Site icon Prime9

Ram Charan – Upasana : రామ్ చరణ్, ఉపాసన బిడ్డకు కళ్ళు చెదిరే గిఫ్ట్ ఇచ్చిన అంబానీ.. వైభవంగా జరగనున్న బారసాల వేడుక

interesting news about ambani gift to ram charan - upasana daughter

interesting news about ambani gift to ram charan - upasana daughter

Ram Charan – Upasana : తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. జూన్ 20న ఉపాస‌న ఆడ‌బిడ్డ‌కి జ‌న్మినిచ్చిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులు అవ్వడంతో మెగా కాంపౌండ్ లో సంబరాలు అంబారాన్ని అంటాయి.  ఇక ఉపాసనటు పాటు చిన్నారిని బయటికి తీసుకు వచ్చే సందర్భంలో ఆల్రెడీ ఒక పేరు అనుకున్నట్లు రామ్ చరణ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే నేడు పాప బారసాల కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ కార్యక్రమం ఎక్కడ జరగనుంది, ఎవరెవరు హాజరుకాబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే.. ఈ బారసాల వేడుక కోసం అంబానీ దంపతులు.. మెగా ప్రిన్సెస్ కోసం ఒక ప్రత్యేక బహుమతి ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. అయితే అందరికీ షాక్ ఇచ్చేలా అంతా కాస్ట్లీ గిఫ్ట్ మెగా ఫ్యామిలీకి అంబానీ ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.

కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అంబానీ దంపతులు బంగారు ఊయలని మెగా ప్రిన్సెస్ కోసం బహుమతిగా ఇచ్చారట. ఇది ఇలా ఉంటే, రామ్ చరణ్ ఈరోజు మెగా ప్రిన్సెస్ పేరుతో మెగా ప్రిన్సెస్ బారసాలకు చెందిన ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు హాజరుకానున్నారు. మరోవైపు చిన్నారికి పెట్టబోయే పేరును ఇప్పటికే ఫిక్స్ చేశారు. చిరంజీవి కుటుంబం ఆంజనేయస్వామిని అత్యంత భక్తితో కొలుస్తుంది. ఈ నేపథ్యంలో, చిన్నారికి ఆంజనేయుడి పేరు కలిసేలా పేరు పెట్టొచ్చని తెలుస్తోంది. మెగా ప్రిన్సెస్ కు ఈరోజు పేరు పెట్టే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. చిన్నారి బాలసాల ఏర్పాట్లకు సంబంధించిన వీడియో

Exit mobile version