Site icon Prime9

Fire Accident : యూపీలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం

diwali Fire Accident at konaseema district causses to women death

diwali Fire Accident at konaseema district causses to women death

Fire Accident : ఉత్తరప్రదేశ్‌లోని ఖుషి నగర్ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. అనుమానాస్పద స్థితిలో స్థానికంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం కావడం అందర్నీ కలచివేస్తుంది. మరణించిన వారిలో ఓ మహిళ, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకోవటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానికులు అప్రమత్తమైనప్పటికీ.. ఫలితం దక్కలేదు. సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఇంట్లో అగ్నిప్రమాదం ఎలాజరిగిందన్న కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధి లోని ఉర్దా బాపు నగర్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగడంతో.. ఇంట్లోని వారంతా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో మంటల్లోనే వారు సజీవదహనం అయ్యారని తెలుస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. అయితే ఆ ఇంట్లోకి మంటలు ఎలా వ్యాపించాయనే విషయంపై విచారణ కొనసాగుతుంది.

Exit mobile version