Director Om Raut: తిరుపతిలో నిన్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపిన చిత్ర యూనిట్ వివాదంలో చిక్కుకుంది. శ్రీవారి ఆలయానికి సమీపంలోనే ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్‌కు దర్శకుడు ఓం రౌత్ ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు తెల్లవారుజామున శ్రీవారిని దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపలకీ వచ్చిన హీరోయిన్ కృతి సనన్‌ని డైరెక్టర్ ఓం రౌత్ కౌగిలించుకుని బుగ్గపై ముద్దులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భక్తుల ఆగ్రహం.. (Director Om Raut)
దీనితో ఈ ఘటనని చూసిన భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆదిపురుష్ సినిమాలో సీత పాత్ర పోషించిన హీరోయిన్‌తో గుడి ఆవరణలో ఈ పనులు ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనో భావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ భక్తులు మండి పడుతున్నారు.