Site icon Prime9

ఆన్‌లైన్ క్యాసినో గేమ్ : ఫోన్ లో క్యాసినో గేమ్ ఆడి 92 లక్షలు పోగొట్టిన విద్యార్ది… ఎక్కడంటే?

degree student playing online casino game and loss 92 lakh rupees

degree student playing online casino game and loss 92 lakh rupees

Online Casino Game : సాధారణంగా ఏ తల్లిదండ్రులయిన పిల్లలని బాగా చదివించి మనం పడిన కష్టాలు వారు పడకుండా సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అయితే తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఓ కుర్రాడు చేసిన పనికి వారంతా ఇప్పుడు జీవితాంతం బాధ పడాల్సిన పరిస్థితి ఎదురైంది. సెల్‌ఫోన్‌లో క్యాసినో ఆడి రూ.92 లక్షలు పోగొట్టాడు ఆ కుర్రాడు. దీంతో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఈ గహతన చోటు చేసుకుంది.

చన్‌వళ్లి శ్రీనివాస్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీపాల్‌రెడ్డి నగరంలో బీటెక్‌ చదువుతున్నాడు. చిన్న కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి (19) నిజాం కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వ్యవసాయమే జీవనాధారంగా బ్రతికే వారికి గ్రామంలో 10 ఎకరాల భూమి ఉంది. ఇటీవల ప్రభుత్వం టీఎస్‌ఐఐసీకి ఆ భూములను అప్పగించింది. భూసేకరణ కింద ఎకరాకు రూ.10.5లక్షలు చొప్పున పరిహారం రాగా… శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి దాదాపు రూ.1.05 కోట్లు వచ్చింది. ఈ సొమ్ముతో శ్రీనివాస్‌రెడ్డి శంషాబాద్‌ మండలం మల్లాపూర్‌ వద్ద అర ఎకరా భూమిని కొనుగోలు చేసేందుకు రూ.70 లక్షలకు ఒకరితో బేరం కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా రూ.20 లక్షలు కూడా చెల్లించారు.

కాగా మిగతా రూ.85 లక్షలను తండ్రి శ్రీనివాస్‌రెడ్డి, తల్లి విజయలక్ష్మి బ్యాంకు ఖాతాల్లో రూ.42.5 లక్షల చొప్పున జమ చేశారు. అయితే అప్పటికే తన తండ్రి ఫోన్లో కింగ్‌ 567 క్యాసినో పేరుతో ఉన్న ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతున్న హర్షవర్ధన్‌ రెడ్డి పరిహారంగా వచ్చిన డబ్బు విషయం తెలుసుకున్నాడు. కొత్తగా కొనుగోలు చేసిన భూమికి సంబంధించి యజమానికి డబ్బు ఇస్తానంటూ.. హర్షవర్ధన్‌ తన తండ్రి ఖాతాలోని రూ.42.5 లక్షల్ని తన బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. తల్లి దగ్గరా ఇదే విషయాన్ని చెప్పడంతో ఆమె బ్యాంకు ఖాతాలోని రూ.42.5 లక్షలను విత్‌డ్రా చేయించి ఇంట్లో ఉంచింది.

హర్షవర్ధన్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతూ తన ఖాతాలోని రూ.42.5 లక్షలను దఫదఫాలుగా పోగొట్టుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకపోగా… ఆ తర్వాత ఇంట్లో ఉంచిన సొమ్మును తన అకౌంట్‌లో పలుమార్లు డిపాజిట్‌ చేసుకుని ఆటలో కోల్పోయాడు. చివరికి తల్లిదండ్రులు డబ్బు గురించి అడగ్గా ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి పోగొట్టినట్లు ఇంట్లో వాళ్లకు తెలిపాడు. అలానే మంలోని మరొకరి వద్ద కూడా రూ.7 లక్షలు అప్పు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు నుంచి మొత్తం రూ.92 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మిన్నకుండిపోయారు. ఈ తరహా ఘటనలు చూసిన తర్వాత అయిన తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించడం ముఖ్యం అని తెలుసుకోవాలి.

Exit mobile version