Site icon Prime9

CM KCR: సీఎం కేసీఆర్ రాజీనామా

CM KCR

CM KCR

 CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేసారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖరారవడంతో ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. సాధారణంగా ఇటువంటి సందర్బాల్లో ముఖ్యమంత్రులు గవర్నర్ ను కలిసి తమ రాజీనామా లేఖను పంపిస్తారు. అయితే కేసీఆర్ తన ఓస్టీద్వారా రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు.అనంతరం ఆయన తన సొంత వాహనంలో ఫామ్ హౌస్ కు వెళ్లారు.కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజక వర్గాల నుంచి పోటీ చేసారు. గజ్వేల్ లో బీజేపీ అభ్యర్ది ఈటల రాజేందర్ పై విజయం సాధించిన కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ది వెంకట రమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆయన మూడో స్దానానికి పరిమితం అయ్యారు. కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుంచి , మేనల్లుడు మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుంచి విజయం సాధించారు.

డీజీపీ పై ఈసీ వేటు..

మరోపక్క ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు డిజిపి అంజనీకుమార్‌పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఫలితాలు రాకముందే రేవంత్ రెడ్డిని కలిసినందుకు ఈసీ సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు ఐపిఎస్‌లు సందీప్ కుమార్ జైన్, మహేశ్ భగవత్‌కి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

Exit mobile version