Cm Kcr: కేంద్రం అవలంబిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదంగా మారాయని కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో నూతన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, జిల్లా కార్యాలయాల కేసీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో కుల, మతాల మధ్య చిచ్చుపెడితే రాష్ట్రంలో తాలిబన్ల పాలన సాగే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
కేంద్రంపై విమర్శలు
కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్లే.. రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. దేశంలోని కుల, మత కల్లోలాలపై మేధావులు, యువత చర్చ పెట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రం తీరువల్ల రాష్ట్రానికి రావల్సిన ఆదాయం తగ్గిందని.. కేంద్రం సహకరించి ఉంటే మరిన్ని ఫలితాలు సాధించేవారిమని కేసీఆర్ అన్నారు.
ప్రతి పనిలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో మహబూబాబాద్‌కు వచ్చిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. జిల్లాలో ఉన్న కాలువలను చూస్తే బాధేసిందని.. ఇక్కడి వరకు నీళ్లు రావనుకున్నానని కేసీఆర్ అన్నారు. ఈ నేలకు ఎప్పుడోస్తావని గోదావరిని వేడుకునేవాడినని కేసీఆర్ అన్నారు.
మరింత అభివృద్ధి దిశగా ముందుకు
మహబూబాబాద్ చాలా వెనుకబడిన ప్రాంతమని.. వీటి అభివృద్ధి కొరకే జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ అన్నారు. దీంతో జిల్లాల అభివృద్ధి వేగంగా సాగుతోందని.. రానున్న రోజుల్లో మరింత అభివృద్ది చేస్తామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు చాలా తక్కువగా ఉండేవని.. ఇపుడు వాటి సంఖ్యను 33 చేసుకున్నామని కేసీఆర్ వివరించారు.
ఇక ఇక్కడి విద్యార్ధులకు కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సీఎం నిధి నుంచి ప్రతి గ్రామానికి నిధులు ఇస్తున్నామని.. ఇలాంటి పథకం మరే రాష్ట్రంలో లేదని కేసీఆర్ గుర్తుచేశారు.
కేసీఆర్ పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో అరెస్టులు కొనసాగాయి. జిల్లాలోని ప్రతిపక్ష నాయకులు విద్యార్ధి సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. వీరిని పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అరెస్టు చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు.. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని జిల్లాలో నిరసనలు వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
బాలకృష్ణ, చిరంజీవి అభిమానుల మధ్య వార్.. వైసీపీ కులాల కుట్ర.. లోకేష్ ట్వీట్ వైరల్
థియేటర్ లో మాస్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. రచ్చ చేసిన ఫ్యాన్స్
Ram Charan-Upasana: నాతో కలిసి నా బిడ్డకూ ఇది స్పెషల్ ఎక్స్ పీరియన్స్.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/