Site icon Prime9

Ysrcp: నువ్వేమైనా పోటుగాడివా అని ఒక ఎమ్మెల్యే.. నువ్వే ఊసరవెల్లి అంటూ మరో ఎమ్మెల్యే.. వైకాపా ఎమ్మెల్యేల తిట్ల పురాణం?

clash-between-ysrcp-mlas-vellampalli-and-udhayabhanu

clash-between-ysrcp-mlas-vellampalli-and-udhayabhanu

Ysrcp: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోవడం సీఎం జగన్ కి కూడా షాక్ కలిగిస్తుంది.

ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకోవడం గమనార్హం. విజయవాడలో వైకాపా నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా విజయవాడ పటమట లోని పార్టీ కార్యాలయానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

ఉదయభాను తిరిగి వెళుతున్న సమయంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ పార్టీ ఇంచార్జి దేవినేని అవినాష్ కూడా అక్కడికి వచ్చారు.

కాగా ఈ సమయంలోనే ఉదయభాను, వెల్లంపల్లి ఒకరికొకరు ఎదురుపడ్డారు.

అయితే ఉదయభానును చూడగానే వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు.

నా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లడానికి నువ్వు ఎవరు? పోటుగాడివా.. అంటూ.. విరుచుకుపడ్డారు.

దీంతో ఆగ్రహానికి గురైన ఉదయభాను..‘ నేను పార్టీలో సీనియర్ లీడర్ని.. పదవికోసం నీలా పార్టీ మారలేదు. నువ్వు పదవుల కోసం మూడు పార్టీలు మారావు. ఊసరవెల్లివి.. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది… నువ్వు నాకు చెప్పేదేంటి..’ అని ఉదయభాను కూడా పరుష పదజాలంతో దూషించారు.

ఇక వెంటనే ఎమ్మెల్యేల అనుచరులు వారిద్దరినీ అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లారు.

ఈ అనూహ్య ఘటనతో స్థానిక నేతలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

స్వంత పార్టీ నేతల మధ్యే వైరాలు ఉంటే .. వీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు అని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఈ విషయంపై సీఎం జగన్ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తుంది.

2014 ఎన్నికల్లో ఒకరిపై మరొకరు పోటీ (Ysrcp)..

2014 ఎన్నికల్లో ఆకుల శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

అదే ఎన్నికల్లో వెలంపల్లి శ్రీనివాసరావు కూడా భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు. వీరిద్దరూ కూడా ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

అయితే ఇటీవల కొంతకాలంగా ఆకుల శ్రీనివాసరావు వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాడు.

వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను గతవారం తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడడానికి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సమయంలో.. అక్కడ ఆశ్చర్యకరంగా ఆకుల శ్రీనివాసరావు కనిపించాడు.

దాంతో ఉదయభానుతో మాట్లాడుతూ జనవరి 28న తన కూతురు పెళ్లికి ముఖ్యమంత్రిని పిలవడానికి వచ్చానని తెలిపాడు.

ఇక ఉదయభాను.. ఆకుల శ్రీనివాసరావును తనతో పాటు సీఎం దగ్గరికి తీసుకువెళ్లి.. వివాహ ఆహ్వానపత్రిక ఇప్పించాడు.

దీంతో తన మీద పోటీ చేసిన వ్యక్తిని ఉదయభాను.. సీఎం జగన్ దగ్గరికి తీసుకువెళ్లడంపై వెల్లంపల్లి మండిపడుతున్నారు.

చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ విషయం ఎంత దూరం పోతుందో అని.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version