Chiranjeevi Counter: చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. కలెక్షన్లలో దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మాస్ తో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మోగాభిమానులు పండగ చేసుకున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు.. జోరుగా కలెక్షన్లు రాబడుతుంది. ఈ సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.
సినిమా విడుదలైన సందర్భంగా వివిధ వెబ్ సైట్స్ ఇచ్చిన రేటింగ్స్ పై ఆయన స్పందించారు. వాటిని గుర్తు చేసుకుంటూ చిరంజీవి జోకులు వేశారు. దీనిపై మెగాస్టార్ స్పందిస్తూ.. ఎవరిని విమర్శించాలనే ఉద్దేశంతో ఈ విమర్శలు చేయడం లేదని చిరంజీవి అన్నారు. సరదాగానే వాటికి రిప్లై ఇస్తున్నట్లు తెలిపారు.
యూఎస్ ప్రీమియర్స్ ఆధారంగా ఇక్కడ ఇక్కడ పలు వెబ్‌సైట్స్‌లో సినిమా రివ్యూలు రాశారు.
చాలా వెబ్ సైట్స్ ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇచ్చారని చిరు అన్నారు.
అలాంటివి చూసి.. తాను పెద్దగా బాధపడలేదని.. ఈ సినిమాపై తనకు పూర్తి నమ్మకం ఉందని చిరంజీవి అన్నారు.
ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అన్నయ్య చిత్రాల తరువాత.. పూర్తిస్థాయి ఎంటర్ టైన్ మెంట్ చిత్రమిదేనని చెప్పుకొచ్చారు.
అలాంటి చిత్రంపై నమ్మకంతోనే ఉన్నానని.. అందుకే వాళ్లు రేటింగ్స్ పట్టించుకోవడం లేదని తెలిపారు.
2.5 రేటింగ్ అంటే.. 2.5 మిలియన్ల డాలర్లు అని చమత్కరించారు.
యూఎస్‌లో అంత రెవెన్యూ వస్తుందని రేటింగ్స్ వాళ్లు ముందే చెప్పారని.. తామే పొరపాటు పడ్డామని తెలిసిందని చిరంజీవి నవ్వులు పూయించారు.
గాడ్‌ఫాదర్ సినిమా తర్వాత మెగాస్టార్ నటించిన చిత్రమిదే. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆశించలేదు.
వాల్తేరు వీరయ్య Waltair veerayya లో రవితేజ ముఖ్య పాత్రలో నటించారు.
ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో
కేథరిన్, శ్రుతిహాసన్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైంది ఈ సినిమా.
సినిమా విడుదలైన ప్రతిచోటా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ చిత్ర విజయానికి సహకరించిన అందరికి చిరు కృతజ్ఞతలు తెలిపాడు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/