Padma Awards 2023 : భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వ్యక్తులకు కేంద్రం ఈ అవార్డులను అందిస్తారు.
ఈ మేరకు ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది.
అందులో ఆరుగురు పద్మ విభూషణ్, 9 మంది పద్మ భూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. కళలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌరసేవ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులకు పద్మ పురస్కారాలు వరించాయి.
రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర హోంశాఖ పద్మ పురస్కారాల జాబితాను విడుదల చేసింది.
పద్మ విభూషణ్ (6) అవార్డు గ్రహీతలు..
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (మహారాష్ట్ర) -ఆర్ట్స్
ములాయం సింగ్ యాదవ్ (ఉత్తర ప్రదేశ్)-పబ్లిక్ అపైర్స్ (మరణానంతరం )
బాలకృష్ణ దోషి (గుజరాత్)-ఆర్కిటెక్చర్ (మరణానంతరం )
కేంద్ర మాజీమంత్రి ఎస్‌ఎం కృష్ణ (కర్ణాటక )-పబ్లిక్ అఫైర్స్
దిలీప్ మహాలనబిస్ (మెడిసిన్)-పశ్చిమ బెంగాల్
శ్రీనివాస్ వర్ధన్ (అమెరికా) – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
పద్మ భూషణ్ (9) గ్రహీతలు..
ఎస్‌ఎల్ భైరప్ప ( కర్ణాటక ) – లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్
కుమార మంగళం బిర్లా ( మహారాష్ట్ర ) ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ
దీపక్ ధార్ ( మహారాష్ట్ర ) – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
వాణి జయరాం ( తమిళనాడు ) ఆర్ట్
చినజీయర్ స్వామి ( తెలంగాణ ) – ఆధ్యాత్మికం
కమలేశ్ డి. పటేల్ ( తెలంగాణ ) – ఆధ్యాత్మికం
సుమన్ కల్యాణ్‌పూర్ ( మహారాష్ట్ర ) – ఆర్ట్
కపిల్ కపూర్ (ఢిల్లీ ) – లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్
సుధామూర్తి (కర్ణాటక ) – సామాజిక సేవ
వీరిలో తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి, కమలేశ్ డి పటేల్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. అలానే ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
అదే విధంగా .. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 మందిని పద్మ పురస్కారాలు వరించాయి.
తెలంగాణ నుంచి పద్మశ్రీ (Padma Awards 2023) పురస్కారానికి ఎంపికైన వారిలో..
మోదడుగు విజయ్ గుప్తా (సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం)
హనుమంతరావు పసుపులేటి (వైద్యం)
బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య)
ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురిని పద్మశ్రీ (Padma Awards 2023) అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది…
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (కళలు)
సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ)
కోట సచ్చిదానంద శాస్త్రి (కళలు)
సీవీ రాజు (కళలు)
గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర (సైన్స్ అండ్ ఇంజినీరింగ్)
అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్ అండ్ ఇంజినీరింగ్)
ప్రకాశ్ చంద్రసూద్ (సాహిత్యం, విద్య విభాగం)
పురస్కారాలు పొందినవారిలో 19 మంది మహిళలు, ఇద్దరు విదేశీయులు ఉన్నారు.
ఏడుగురికి మరణానంతరం ఈ అవార్డులు ప్రకటించారు.
మొత్తం అవార్డుల్లో అత్యధికంగా మహారాష్ట్రకు 12, కర్ణాటక 8, గుజరాత్ 8, ఉత్తర్‌ప్రదేశ్ 8, ఏపీ 7, తెలంగాణ 5, తమిళనాడు 5, పశ్చిమబెంగాల్ 4, దిల్లీ 4, ఒడిశా 4, బిహార్ 3, అస్సాం 3, రాజస్థాన్ 3, ఛత్తీస్‌గఢ్ 3, మధ్యప్రదేశ్‌కు 3 దక్కాయి.
మిగతా రాష్ట్రాల నుంచి ఇద్దరు లేదా ఒకరు విజేతలున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/