BRS meeting in Khammam: సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) ఖమ్మం( BRS meeting in Khammam)లో నిర్వహించిన భారీ సభఅఖిలేష్ విమర్శి జనసంద్రం అయింది.
సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లాంటి రావడంతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది.
బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఏపీ,తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఖమ్మం నగరం కిటకిటలాడింది.
ఖమ్మం జిల్లాకు వరాలు
బీఆర్ఎస్ సభ సందర్భంగా సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా ప్రజలకు వరాల జల్లు కురిపించారు.
జిల్లాలోని 589 గ్రామ పంచాయితీలకు .. ఒక్కొ గ్రామ పంచాయితీకి రూ. 10 లక్షలు కేటాయించారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ఇవి మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ. 30 కోట్లు చొప్పున, ఖమ్మం మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు మంజూరు చేశారు.
10 వేల జనాభా దాటిన మేజర్ పంచాయితీలకు రూ. 10 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు నెలలోపల ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ స్థలం దొరక్కపోతూ.. సేకరించైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆర్థిక మంత్రికి కేసీఆర్ సూచించారు.
ఖమ్మం ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ను జేఎన్టీయూ ఆధర్యంలో మంజూరు చేస్తామని సీఎం తెలిపారు.
అందుకే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది
కాగా, బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి గల కారణాలను సీఎం కేసీఆర్ వివరించారు. సవిశాల భారతంలో కరువులు చూశామని..వరదలు చూస్తున్నామన్నారు.
ప్రపంచ దేశాల మాదిరి ఒక గొప్ప ప్రాజెక్టు మనకు లేకుండా పోయింది. ఇప్పటికీ మంచినీళ్లలకు భాదపడాలా అని కేసీఆర్ ప్రశ్నించారు.
సరైన పరిపాలన రావలా లేక సన్నాసుల లెక్క ఉండాలా అన్నారు. ఇలాంటివి ప్రశ్నించడానికే.. ఈ చైతన్యం తీసుకురావడానికే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని తెలిపారు.
150 మంది మేధావులు బీఆర్ఎన్ విధివిధానాలు రూపొందిస్తున్నారన్నారు.
అఖిలేష్ విమర్శలు..
రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కాపీ కొడుతుందని అఖిలేష్ విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం కావాలనే ఇబ్బందులకు గురిచేస్తుందని అఖిలేష్ అన్నారు.
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని భాజపాను ఇక్కడి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.
దర్యాప్తు సంస్థలతో విపక్ష నేతలను కేంద్రం భయపెడుతుందని అలాంటి వాటికి భయపడమని అఖిలేష్ అన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/