Site icon Prime9

అనుష్క: ’భూతకోల‘ వేడుకలకు హాజరయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క

Anushka

Anushka

Anushka: లేడీ సూపర్ స్టార్ గా అభిమానులను అలరించిన అనుష్క శెట్టి బాహుబలి 2 తర్వాత రెండు సినిమాలు మాత్రమే చేసింది. అనుష్క శెట్టి ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ పోలిశెట్టి సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అనుష్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల యువి క్రియేషన్స్ వేడుకలు కూడా జరిగాయి. అనుష్క స్వస్థలం మంగళూరు. కాంతారా సినిమాలో చూపించే భూతకోల వేడుకలు అక్కడ ఫేమస్. తాజాగా ఈ వేడుకకు అనుష్క హాజరైంది. అనుష్క భూతకోల నృత్యాలను భక్తిశ్రద్ధలతో వీక్షించింది.

భూతకోల వేడుకలకు అనుష్క హాజరైన ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. అనుష్క తన ఫోన్‌లో భూతకోల డ్యాన్స్‌ని రికార్డ్ చేస్తూ కనిపించింది. భూతకోల వేడుకలు దక్షిణ కర్ణాటక సంప్రదాయంలో ఒక భాగం. అక్కడ ప్రజలు ఈ పండుగలను వైభవంగా జరుపుకుంటారు. కాంతార సినిమాలో కూడా రిషబ్ శెట్టి ఈ వేడుకలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఈ సినిమా ప్రభావంతో తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటిన ‘భూత కోల’ సంప్రదాయ దైవ నృత్యకారులకు ఆర్థిక సాయం అందించేందుకు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. నెలకు రూ. 2000 చొప్పున అలవెన్స్ అందించనున్నట్లు బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌ వెల్లడించారు.

ప్రస్తుతం అనుష్క నటిస్తోన్న సినిమాలో నవీన్ పొలి శెట్టి హీరో. తన కంటే వయసులో చిన్న వాడైన వ్యక్తితో ప్రేమలో పడే అమ్మాయి కథ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల అనుష్క పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాలో ఆమె పాత్ర పేరుతో పాటు లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అన్వితా ర‌వ‌ళి శెట్టి అనే పాత్ర‌లో అనుష్క క‌నిపించ‌నుంది

Exit mobile version