Site icon Prime9

Anasuya Bharadwaj: అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. అనసూయ

Tollywood: విజయ్ దేవరకొండ అభిమానులు గతంలో నటి అనసూయ భరద్వాజ్‌తో సోషల్ మీడియాలో చాలాసార్లు గొడవపడ్డారు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ కస్టమ్స్ వాడారని అనసూయ బహిరంగంగానే విమర్శించింది. అప్పటి నుండి, నటుడి అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఆమెకూడా వారిపై తీవ్రంగా స్పందిస్తోంది. ఈ రోజు, అనసూయ తన కొత్త చిత్రం లైగర్ కు టాక్ ప్రతికూలంగా రావడంతో పరోక్షంగా విజయ్ దేవరకొండ పై ట్వీట్‌ను పోస్ట్ చేసింది.

అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా. ఎదుటివారి బాధని చూసి సంతోష పడడం లేదు కానీ ధర్మమే గెలిచింది’ అంటూ అనసూయ ట్వీట్ చేసింది. అనసూయ #NotHappyOnSomeonesSadness, #FaithRestored అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించారు.

అర్జున్ రెడ్డి చిత్రంలో అమ్మని తిట్టినట్లుగా ఉండే ఒక బూతు డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అర్జున్ రెడ్డి మూవీ సమయంలో ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందో అందరికి తెలిసిందే. ఆ డైలాగ్ ని అనసూయ కూడా వ్యతిరేకిస్తూ మీడియాకి ఎక్కింది. అమ్మని, అమ్మాయిలని నెగిటివ్ గా ఉపయోగించుకునే కంటెంట్ అవసరమా, మనం పడే గొడవల్లో ఆడవాళ్ళని లాగడం ఏంటి, ఇలాంటి వాటికి తానూ వ్యతిరేకం అంటూ అనసూయ అప్పట్లో మీడియా డిబేట్స్ లో తెలిపింది. విజయ్ దేవరకొండ ఆమె వ్యాఖ్యలు లేదా విమర్శలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎప్పుడూ స్పందించలేదు. కానీ అతని అభిమానులు ఆమెను బాగా ట్రోల్ చేశారు.

 

Exit mobile version