Site icon Prime9

Allu Arha : అర్హ క్యూట్ పిక్స్ వైరల్ ..ప్రిన్సెస్ కి బర్త్ డే విషెస్ అంటూ బన్నీ పోస్ట్..

allu arjun shares cute pics and says birthday wishes to allu arha

allu arjun shares cute pics and says birthday wishes to allu arha

Allu Arha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి అందరికి తెలుసు . ఆమె గురించి ఎప్పుడు సోషల్ మీడియా లో ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది . ఆమె క్యూట్ క్యూట్ మాటలు ,ముచ్చట్లు అల్లు అర్జున్ అభిమానులతో పంచుకుంటు ఉంటారు . అర్హ తన చిలిపి అల్లరితో అల్లు అభిమానులతో పాటు ప్రతి ఒకర్ని ఆకట్టుకుంటూ వస్తుంది. ఇక అల్లు అర్జున్, స్నేహ రెడ్డి రెగ్యులర్ గా అర్హ క్యూట్ ఫోటో లు ,వీడియో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అర్హ ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి.

తాజాగా నేడు అల్లు అర్హ ఏడవ పుట్టిన రోజు కావడంతో బన్నీ కొన్ని ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు.ఇటీవలే వరుణ్ పెళ్లి నుంచి అర్హవి కొన్ని క్యూట్ ఫోటోలు స్నేహ కూడా షేర్ చేశారు . అలాగే వరుణ్ పెళ్ళిలో అర్హని ఎత్తుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. నా లిటిల్ ప్రిన్సెస్ కి బర్త్ డే విషెస్  అంటూ పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అలాగే అల్లు అర్హతో సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో కూడా బన్నీ తన సోషల్ మీడియాలో షేర్ చేసి నా సంతోషం అంటూ ఆర్హ గురించి పోస్ట్ చేశాడు. ఇంతక ముందు షేర్ చేసిన దీపావళి సెలెబ్రేషన్ వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి . ఇప్పుడు ఈ బర్త్ డే పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇక బన్నీ అభిమానులు, పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అర్హకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అర్హ అటు స్కూల్ కి వెళ్తూనే తన క్యూట్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఆల్రెడీ శాకుంతలం సినిమాలో నటించిన అర్హ త్వరలో మరిన్ని సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించనుందని సమాచారం. భవిష్యత్తులో అర్హ హీరోయిన్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక అర్హ పుట్టిన రోజు వేడుకల ఫోటోలు, వీడియోల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 

Exit mobile version