World’s Most Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..!

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వార్షిక సర్వే 2022 వివరాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ సిటీ మొదటి స్ధానంలో నిలిచింది.

World’s Most Expensive Cities: ఈ ప్రపంచంలో ఎన్నో సుందర నగరాలున్నాయి. కొన్ని సాధారణ నివాసానికి అనుకూలమైతే మరికొన్ని లగ్జరీతో జీవించడానికి అనుకూలంగా ఉంటాయి. మరికొన్ని పర్యాటకంగా ఇలా ఎన్నో రకాల ప్రాంతాలు ఉంటాయి. కాగా ఇప్పుడు అలాంటి ఖరీదైన నగరాల గురించి చూసేద్దాం. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వార్షిక సర్వే 2022 వివరాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ సిటీ మొదటి స్ధానంలో నిలిచింది.

ద్రవ్యోల్బణం కారణంగా న్యూయార్క్ నగర జీవనం అత్యంత ఖరీదుగా మారిపోయింది. గత పదేళ్లలో ఎనిమిది సార్లు అత్యంత ఖరీదైన నగరంగా ఉన్న సింగపూర్ ఈసారి న్యూయార్క్ తో కలసి మొదటి స్థానాన్ని పంచుకుంది. ఇకపోతే గతేడాది మొదటి స్థానంలో ఉన్న టెల్ అవీవ్ ఈ ఏడాది మూడో స్థానానికి పరిమితమైంది. హాంగ్ కాంగ్ 4, లాజ్ ఏంజెలెస్ 5, జూరిచ్ 6, జెనీవా 7, శాన్ ఫ్రాన్సిస్కో 8, ప్యారిస్ 9, సిడ్నీ, కోపెన్ హెగెన్ 10వ స్థానాల్లో ఉన్నాయి.

నివాస వ్యయం తక్కువగా ఉన్న టాప్ 10 నగరాల్లో.. డమాస్కస్ 172, ట్రిపోలి 171, టెహ్రాన్ 170, ట్యూనిస్ 169, తాష్కెంట్ 168, కరాచీ 167, ఆల్మెటీ 166, అహ్మదాబాద్ 165, చెన్నై 164, అల్జీర్స్ 161, బెంగళూరు 161, కొలంబో 161వ స్థానాల్లో ఉన్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠాలకు చేరడంతో న్యూయార్క్ మొదటి స్థానంలో నిలవడానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: 48,500 ఏళ్ల నాటి జోంబీ వైరస్ పునరుద్దరణ..