Prime9

Operation Akarsh: ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్.. హైకోర్టుకు పోలీసులు

Hyderabad: తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ కేసులో అత్యవసరణ విచారణ చేపట్టాలని తెలంగాణ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. సరైన ఆధారాలు లేవంటూ ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించిన నేపథ్యంలో పోలీసులు హైకోర్టు మెట్లెక్కారు. అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, సాధారణ పిటిషన్‌ దాఖలు చేయాలని, దానిపై రేపు విచారణ చేపడతామని సైబరాబాద్‌ పోలీసులకు హైకోర్టు తెలిపింది.ఇది కూడా చదవండి: Minister KTR: మీడియా ముందు నోరుజారద్దు.. పార్టీ శ్రేణులకు కేటిఆర్ సూచన

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా రూ. 400కోట్లతో 4గురు తెరాస శాసనసభ్యులను ప్రలోభాలకు గురిచేసే క్రమంలో ముగ్గురు వ్యక్తులు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఎంతమేర నగదు దొరికిందో సరైన సమాధానాలు కాని, వీడియోలు గాని పోలీసులు ఘటనా ప్రాంతంలో మీడియాకు చూపించలేకపోయారు. మరోవైపు పోలీస్ ఎఎఫ్ఐఆర్ లో నిందితుల పేర్లతో పాటు భాజపా అని నమోదు చేయడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుబట్టారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని, తెలంగాణ భాజపా శ్రేణులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం మీద ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాల డీల్ ఆధ్యంతం మలుపులు తిరుగుతూ తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ ఎమ్మెల్యే కొనుగోలు డీల్ హీటెక్కించింది.

 

Exit mobile version
Skip to toolbar