Prime9

KCR Yadadri Tour: నేడు యాదాద్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్

 KCR Yadadri Tour: నేడు  సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు.శుక్రవారం రోజు కేసీఆర్  దంపతులు లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక  పూజలు చేయనున్నారు.అంతేకాకుండా సీఎం కేసీఆర్ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని కానుకగా ఇవ్వనున్నారని తెలిసిన సమాచరం.సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.

లక్ష్మీనరసింహస్వామి వారికి కిలో 16 తులాల బంగారం ఇవ్వాలని కేసీఆర్ గతంలో నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆ బంగారాన్ని స్వామివారికి సమర్పించనున్నారని తెలిసిన సమాచారం.ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరి 11.30 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకొని.. ఇదే క్రమంలో ఆలయంలోని వివిధ పనులను పరిశీలించే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది.దసరాకు జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన పై ఆలోచనా నేపథ్యంలో సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

అక్టోబర్ 1 న హనుమకొండకు సీఎం వెళ్లనున్నారు 
అక్టోబరు 1న హనుమకొండ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారని ఎప్పుడో ప్రకటించారు.ములుగు రోడ్డులోని ప్రతిమ రిలీఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ను ప్రారంభోత్సవానికి సీఎం హాజరవ్వబోతున్నారు

Exit mobile version
Skip to toolbar