Prime9

MLC Kavitha’s New Party: జూన్ 2న కవిత కొత్త పార్టీ.. ఎంపీ రఘునందన్ షాకింగ్ కామెంట్స్

Raghunandan Rao said MLC Kavitha Starting a New Political Party: జూన్ 2న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టుబోతున్నారని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా కొంత కాలంగా బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కచ్చితంగా అర్థమవుతుందని అన్నారు. గతంలో పార్టీని పెట్టి తెలంగాణ అంతటా పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల తరహాలోనే కవిత కూడా చేయనున్నారని తెలిపారు.

 

ఇవాళ మెదక్ జిల్లా తుఫ్రాన్ లో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై జోస్యం చెప్పారు. అసలు తెలంగాణలో బీఆర్ఎస్ కు కాలం చెల్లిందని అందుకే కేసీఆరే కూతురు కవితతో కొత్త పార్టీ పెట్టిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. లేకపోతే తండ్రి, కూతుళ్ల ఇద్దరి మధ్య మధ్యవర్తులెందుకు ఉంటారని ఆరోపించారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాన్ని అయ్యానన్న కవిత.. పదేళ్లుగా దెయ్యాల మధ్య రాజకీయాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై కవిత కానీ, బీఆర్ఎస్ కానీ ఎలా స్పందిస్తుందో మరి.

 

Exit mobile version
Skip to toolbar