Telangana Voter Turnout: తెలంగాణలో 119 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం సాయంత్రం 7 గంటల వరకు 64.14 శాతం పోలింగ్ నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.అత్యధికంగా జనగాంలో 83.34 శాతం, నర్సంపేటలో 83 శాతం, నకిరేకల్ లో 82.34 శాతం, భోంగిర్‌లో 81 శాతం, పాలకుర్తిలో 81 శాతం, జహీరాబాద్‌లో 79.8 శాతం, నర్సాపూర్ (78.89 శాతం), డోర్నకల్ (79.32 శాతం), వైరా (79.20 శాతం) పోలింగ్ నమోదయింది.
హైదరాబాద్ లో తక్కువగా.. ( Telangana Voter Turnout)
అదేవిధంగా వరంగల్ వెస్ట్‌లో 51.34 శాతం, మేడ్చల్ (54.62 శాతం), కరీంనగర్ (64.17 శాతం), వరంగల్ ఈస్ట్ (64 శాతం) ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు కేవలం 40.69 శాతం తో రాజధాని హైదరాబాద్ లో తక్కువగా పోలింగ్ నమోదయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (47.14 శాతం), ఖైరతాబాద్ (45.5 శాతం), గోషామహల్ (45.79 శాతం), సనత్ నగర్ (45.1 శాతం), సికింద్రాబాద్ (45.01 శాతం)లో అత్యధికంగా పోలింగ్ నమోదయింది.హైదరాబాద్‌లో అత్యల్పంగా యాకుత్‌పురా (27.89 శాతం), నాంపల్లి (32 శాతం), చార్మినార్ (34 శాతం), మలక్‌పేట్ (36.9 శాతం), బహదూర్‌పురా (39.11 శాతం), చాంద్రాయణగుట్ట (39 శాతం) పోలింగ్ జరిగింది. మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగ్గా, అందులో 10,969 కేంద్రాలను సమస్యాత్మంగా గుర్తించారు.