Site icon Prime9

Revanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారిన ధరణి పోర్టల్ .. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆలంపూర్ లో జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి స్థానంలో కొత్త యాప్ తీసుకొస్తామని చెప్పారు.

ఆలంపూర్ గడ్డ.. కాంగ్రెస్ అడ్డా..(Revanth Reddy)

ఆలంపూర్ గడ్డ.. కాంగ్రెస్ అడ్డా అన్న రేవంత్ ఇక్కడ జోగులాంబ ఆలయ అభివృద్ధిని కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. జోగులాంబ ఆలయానికి ఇస్తానన్న రూ.100 కోట్లు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నించారు. కరెంట్‌పై కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంట్ వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.24 గంటల వస్తుందని నిరూపిస్తే నా నామినేషన్ వెనక్కి తీసుకుంటానంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేసారు. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించే బాధ్యత తనదన్న రేవంత్ కాంగ్రెస్ పోరాటంతోనే తుమ్మిళ్ల ప్రాజెక్ట్ వచ్చిందన్నారు. కేసీఆర్ బోయలను నమ్మించి మోసం చేశారని రేవంత్ ఆరోపించారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బోయలకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఆలంపూర్ కాంగ్రెస్ అభ్యర్ది సంపత్ కుమార్ ను మంచి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్జప్తి చేసారు.

అన్ని కక్కిస్తాం..! కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ |Revanth Reddy Aggressive Comments On CM KCR

Exit mobile version
Skip to toolbar