Bjp : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సమర శంఖం పూరిస్తున్నాయి. ఈ క్రమంలోనే జోరుగా నామినేషన్ల ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు కొన్ని పార్టీలు పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించకపోవడం గమనార్హం. అయితే నేటితో నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇక అభ్యర్ధుల లాస్ట్ లిస్ట్ భారతీయ జనతా పార్టీ తాజాగా ప్రకటించింది. 14 మంది అభ్యర్థుల జాబితాను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ చేసిన లిస్ట్ తో జనసేనకు రిజర్వ్ అయిన సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించినట్లు చెప్పాలి.
బీజేపీ చివరి జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్ధులు..
1. బెల్లంపల్లి- బొగ్గు ఎమామి
2.పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్
3. సంగారెడ్డి-దేశ్ పాండే రాజేశ్వర్ రావు
4.మేడ్చల్-ఏనుగు సుదర్శన్ రెడ్డి
5. మల్కాజిగిరి-ఎన్. రామచంద్రరావు
6. సేరిలింగంపల్లి-రవికుమార్ యాదవ్
7.నాంపల్లి-రాహుల్ చంద్ర
8. చాంద్రాయణగుట్ట-కె. మహేంద్ర
9.కంటోన్మెంట్-గణేష్ నారాయణ్
10. దేవరకద్ర-కొండ ప్రశాంత్ రెడ్డి
11. వనపర్తి – అనుగనా రెడ్డి
12. అలంపూర్-మేరమ్మ
13. నరసంపేట-పుల్లారావు
14. మధిర-పెరంపల్లికి చెందిన విజయరాజు
ఇక ఎన్నికల ప్రచారం కోసం కూడా బీజేపీ గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి అగ్ర నాయకులు ప్రచారానికి రానున్నారు.తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రాజాసింగ్ వంటి నేతలకు కూడ ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. ఈ పొత్తు నేపథ్యంలో బీజేపీ జనసేనకు ఎనిమిది అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. ఈ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన ఇప్పటికే ప్రకటించింది.