Site icon Prime9

Vivo X90: అదిరిపోయే ఫీచర్లతో Vivo X90 స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది..!

vivo-x90-series launch

vivo-x90-series launch

Vivo X90: రోజురోజుకు మారుతున్న ట్రెండ్ కు తగినట్టుగా కొత్తకొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. అతి తక్కువ బడ్జెట్ నుంచి అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ వరకు నిత్యనూతన ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ తరుణంలోనే చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో ఎక్స్‌90 (Vivo X90) పేరుతో ఈ ఫోన్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసురానున్నారు.

వినూత్నమైన డిజైన్‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు. వివో కెమెరా ఫోక‌స్డ్ ఎక్స్80 సిరీస్ కొన‌సాగింపుగా ఎక్స్‌90 సిరీస్‌ను తీసుకొచ్చారు. ఈ సీరిస్‌లో భాగంగా వివో ఎక్స్‌90 (Vivo X90), వివో ఎక్స్‌90ప్రొ (Vivo X90 Pro), వివోఎక్స్‌90 ప్రొ ప్లస్ (Vivo X90 Pro Plus) మూడు మోడళ్ల ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురానున్నారు.
ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 13 ఆరిజిన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే వివో ఎక్స్‌90 ప్రొలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. అలాగే 4700ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యంతో 50డ‌బ్ల్యూ వైర్‌లెస్ చార్జింగ్ స‌పోర్ట్‌ను వీటిలో ఇవ్వనున్నారు. కాగా ధర విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ వివో ఇవ్వలేదు.

ఇదీ చదవండి: బ్రిజిల్లోనూ కూతపెడుతున్న “కూ” యాప్.. 48 గంటల్లో 1 మిలియన్ డౌన్లోడ్స్

Exit mobile version